వెంట్రుకల పెరుగుదలకు చేప నూనె

తలపై చర్మానికి, వెంట్రుకలకు, చర్మానికి చేప నూనె మంచిది.

జుట్టు రాలటాన్ని తగ్గించి, కేశాల పెరుగుదలను వేగవంతం చేస్తుంది.

తలపై చర్మాన్ని మెరుగుపరచి, వతైన జుట్టు పెరుగుటను ప్రోత్సహిస్తుంది.

మందులు లేదా చేప నూనె పట్ల సున్నితత్వాన్ని కలిగి ఉంటె, వీటి వాడకాన్ని ఆపేయండి.

జుట్టు రాలటం వలన వయసు మీరిన వారిలా కనపడుతుంటారు. జుట్టు రాలకుండా ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఫలితం కనపడటం లేదా.. ఏదిఏమైనా మీరు వాడే వాటి కన్నా మేము తెలిపే వాటిని వాడటం వలన జుట్టు రాలటం తప్పకుండా తగ్గుతుంది మరియు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొన్ని ఉత్పత్తుల కన్నా, మేము తెలిపే వాటి వలన తప్పకుండ మంచి ఫలితాలను పొందుతారు. వీటిలో ముఖ్యంగా చేప నూనెలు జుట్టు రాలటాన్ని శక్తివంతంగా తగిస్తాయి, కొద్ది రోజులుగా వీటి వాడకం కూడా పెరుగింది.

జుట్టుకు సహాయం

చేప నూనెలు ఆరోగ్యానికి చాలా మంచివని అందరికి తెలిసిందే, కానీ జుట్టు రాలకుండా ఎలా సహాయపడతాయి? అనే కదా మీ సందేహం. అవును చేప నూనెలు జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది అనే చెప్పవచ్చు కారణం అందులో ఉండే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లు. పొడి జుట్టు మరియు పొలుసులుగా మారిన జుట్టును ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లు సరైన విధంగా మార్చి, జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయని పరిశోధనలో వెల్లడైయింది. జుట్టు రాలటానికి మాత్రమె కాకుండా, చాలా మంది కేశాల ఆరోగ్యాన్ని మెరుగుపరచుటకు కూడా ఈ నూనెలను వాడుతున్నారు. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించటమే కాకుండా, జుట్టు బలంగా పెరుగుటకు కూడా సహాయపడతాయి.

ఈ ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లు జుట్టు పెరుగుదలను మెరుగుపరచటమే కాకుండా మెదడును దాని విధి నిర్వహణలో సమస్యలు రాకుండా చేస్తుంది మరియు కణాల ఆరోగ్యం మరియు నిర్జీవ కణాలను ఇతర ఆరోగ్య కణాలచే భర్తీ చేయిస్తుంది. చేప నూనెలు చర్మాన్ని ఉద్దీపనలకు గురిచేసి జుట్టు మరియు ఫాలికిల్ పెరుగులను అధికం చేస్తంది. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లు శక్తివంతమైన యాంటీ- ఆక్సిడెంట్'లను అందిస్తుంది. ఈ యంటీ-ఆక్సిడెంట్'లు జుట్టు రాలటాన్ని, పెరుగుదలకు ఆటంకాలను కలిగించే ఫ్రీ-రాడికల్'లను వినాశం చేస్తుంది.

ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లు కేశాల సమగ్రతను మరియు కణాలలోకి అవసరం అయ్యే పోషకాల ప్రవేశ్యశీలతను పెంచుతుంది. ఈ విధంగా జుట్టు పెరుగుదలను వేగంగా మరియు బలమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చేప నూనె రోగనిరోధక వ్యవస్థ వలే యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండటం వలన జుట్టు రాలుటను తగ్గిస్తుంది. కానీ నూతన పరిశోధనలు చేప నూనెలు జుట్టు రాలటాన్ని తగ్గిస్తాయని ప్రయోగ పూర్వకంగా నిరూపించబడలేదు కానీ చేప నూనెలో ఉండే ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లు మాత్రం చర్మాన్ని మరియు తలపై చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచి, పొడితత్వాన్ని మరియు ఇతర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. జుట్టు రాలటం మరియు కేశాల త్వరిత పెరుగుదలకు చేప నూనెలను వాడమని శాస్త్రజ్ఞులు సలహా ఇస్తున్నారు. చేపలు అధికంగా ఉన్న ఆహరాలను తీసుకోవటం వలన వివిధ రకాల జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.

కొన్ని సమయాల్లో చేప నూనెలు ఇతర మందులతో చర్యలు జరిపుతాయి కావున మందులను వాడుతున్న సమయంలో చేప నూనెల వాడకాన్ని తగ్గించాలి. కావున చేప సంబంధిత ఆహారాలను తినే ముందుగా మీ వైద్యుడిని కలిసి, తగిన సూచనలను పాటించండి. శరీరంలో తక్కువ గ్లూకోస్ ఉన్న అనగా, టైప్-2 డయాబెటిస్ ఉన్న వారు మందులు వాడుతున్న సమయంలో చేప నూనెలను వాడటం వలన శరీరంలో ఉండే ఇన్సులిన్ స్థాయిలో మార్పులు కలగవచ్చు. అధిక మొత్తంలో చేప నూనెల వలన రక్తం పలుచబడి, స్రావాలు, వాపులను, గాయాలను కలుగచేస్తుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved