కిడ్నీకి ఈ ఐదు...

భారతదేశంలో అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్న వ్యాధి కిడ్నీల వైఫల్యం. ఆధునిక వైద్య ప్రక్రియలు ఎన్ని వచ్చినా.. కిడ్నీ ఫెయిల్యూర్‌ను పూర్తి స్థాయిలో అధిగమించలేకపోతున్నాం. కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారు సరైన వైద్యంతో పాటు తమ డైట్‌లో ఈ ఐదు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు.

రెడ్‌ క్యాప్సికమ్‌..

తక్కువ పొటాషియం నిల్వలు.. విటమిన్‌-సి, ఎ, బి6 మోతాదు ఎక్కువగా ఉండే రెడ్‌ క్యాప్సికమ్‌ తరుచూ తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే ఫోలిక్‌ ఆసిడ్‌, ఫైబర్‌ జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు దోహదం చేస్తాయి. రెడ్‌ క్యాప్సికమ్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సీరమ్‌ క్రియేటినిన్‌ను నియంత్రిస్తుంది.

ఆపిల్‌..

కిడ్నీల వైఫల్యం.. గుండె పనితీరుపై దుష్ప్రభావం చూపుతుంది. దీన్ని అరికట్టడానికి డైట్‌లో యాపిల్‌ పళ్లను చేర్చడం మంచిది. యాపిల్‌లోని యాంటీ ఇన్‌ఫ్లామెటరీ కాంపౌండ్స్‌ వంట్లో కొవ్వును కరిగించడంతో పాటు.. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

క్యాబేజీ..

విటమిన్‌-సి, కె, ఫైబర్‌ ఎక్కువగా ఉండే క్యాబేజీలో ఫోలిక్‌ యాసిడ్‌ పాళ్లు కూడా అధికంగానే ఉంటుంది. ఇది క్యాన్సర్‌ రాకుండా అరికడుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. కిడ్నీల వైఫల్యం వల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ను క్యాబేజీ నియంత్రించగలదు.

ఉల్లి.. వెల్లుల్లి..

ఉల్లిలో ఉండే ఫ్లవనాయిడ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కిడ్నీలు వైఫల్యం చెందిన వారు నీరు ఎక్కువగా తీసుకోకూడదు. ఉల్లిని డైట్‌లో చేర్చడం ద్వారా.. దప్పిక తగ్గడంతో పాటు శరీరానికి అవసరమయ్యే నీరూ అందుతుంది. ఇక వెల్లుల్లి పొడి.. డయాబెటిక్‌ పేషంట్స్‌కు దివ్యౌషధంగా పనిచేస్తుంది. గుండె పనితీరును మెరుగుపరచడంలో వెల్లుల్లి క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved