గొర్రెలు కాచే అమ్మాయి విద్యాశాఖ మంత్రి అయ్యింది

ఒకప్పటి గొర్రెల కాపరి నజత్ బెల్కసెమ్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రి అయ్యింది. సాధారణ అమ్మాయిలా బడికి వెళ్తూ సాయంత్రం పూట గొర్రెలను కాచే నజత్ ఫ్రాన్స్ దేశపు విద్యాశాఖ మంత్రిగా ఎదిగింది. మొరాకో దేశంలోని నడోర్ దగ్గర బ్నిచికెర్ అనే మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి నేడు ప్రతిష్టాత్మకంగా ఫ్రాన్స్ దేశపు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. తన తండ్రి తాపీ మేస్త్రీగా పనిచేసేవాడు. నజత్ కుటుంబం మొరాకో నుండి 1982లో ఫ్రాన్స్ కు ఉపాధి కోసం వలస వెళ్లారు.

చిన్నప్పటి నుంచి నజత్‌కు రాజకీయ అంశాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేది. అందుకే 2002లో పారిస్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ స్టడీస్‌లో డిగ్రీ పట్టా అందుకుంది. ఆ తర్వాత సోషలిస్ట్ పార్టీలో చేరింది. 2003లో లైయన్ మేయర్ గెరార్ కొలంబ్ జట్టులో కార్యకర్తగా కీలకపాత్ర వహించింది. ప్రజస్వామ్యంలో వివక్ష, పౌర హక్కుల కోసం పోరాడింది. 2004లో రోన్ ఆల్ఫేస్‌కి రీజనల్ కౌన్సిల్‌గా ఎంపికయింది. 2005లో పెళ్లి చేసుకుంది. 2006లో సోషలిస్ట్ పార్టీకి ముఖ్య సలహాదారుగా సేవలందించింది. 2007లో సెగోలెన్ రాయల్స్ క్యాంపెయిన్ టీమ్‌కు స్పోక్ ఉమెన్‌గా వ్యవహరించింది. 2008 కల్చరర్ కమిషన్‌లో పనిచేసింది. 2012లో క్యాబినెట్ మంత్రిగా, మహిళా హక్కుల అధికార ప్రతినిధిగా ఫ్రెంచ్ ప్రభుత్వం నియమించింది. 2014లో చిన్న వయస్సులోనే మొదటి మహిళావిద్యాశాఖ మంత్రిగా ఎంపికై న నజత్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved