CA చదవాలనుకునే వారికి శుభవార్త… ఎంట్రన్స్ పరీక్ష రద్దు

చార్టెర్డ్‌ అకౌంటెట్‌ కోర్సు(CA) అర్హత కోసం నిర్వహించే కామన్‌ ప్రొఫిసియెన్సీ టెస్ట్‌ (సీపీటీ)ను త్వరలో రద్దు చేయనున్నారు. ఈ విషయాన్ని ఐసీఏఐ అధ్యక్షుడు దేవరాజారెడ్డి శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సీపీటీని రద్దు చేయనున్నామని, ఆ స్థానంలో నవంబరు నుంచి మళ్లీ ఫౌండేషన్‌ కోర్సును ప్రారంభించనున్నామని అన్నారు. సీపీటీ టెస్ట్ లో ఇదివరకు 200 మార్కులు ఉండేవని, అయితే ఇంటర్‌ అర్హతతో కూడిన ఫౌండేషన్‌ కోర్సు కోసం 400 మార్కులు ఉంటాయని తెలిపారు. కాగా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు నేరుగా సీఏ కోర్సులో చేరవచ్చని, అయితే బీకాం విద్యార్థులు 55%, బీఎస్సీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులు 60% మార్కులు సాధించి ఉండాలని స్పష్టం చేశారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved