మీకు 10 సంవత్సరాల లోపు అమ్మాయి ఉందా? అయితే మీకో శుభవార్త.

నిజంగానే ఇది శుభవార్త, ఆడపిల్లల్ని కన్నవారికి ఓ ఆర్థిక భరోసా…. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కీమ్ సుకన్య సంవృద్ది యోజన..ఈ స్కీమ్ లో మీరు నెలకు కొంత డబ్బు జమా చేసినట్లైతే మీ పాప చదువు లేదా పెళ్లి వరకు దానికి నాలుగు రెట్ల డబ్బును పొందవచ్చు. మీ ఇంట్లో 10 సంవత్సరాలలోపు పాప ఉంటే….ఈ స్కీమ్ లో పాప పేర ఓ అకౌంట్ ఓపెన్ చేయండి.. తర్వాత ఆమె చదువు పెళ్లి కోసం అప్పులు చేసే బాధ ఉండదు. పేరెంట్స్ గా మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన వారవుతారు. ఈ స్కీమ్ డీటైల్స్ కింద ఉన్నాయి

1.అమ్మాయి జన్మించినప్పటి నుంచి పది సంవత్సరాలలోపు ఎప్పుడైనా పథకంలో చేరవచ్చు. స్థానిక తపాలా కార్యాలయంలో కానీ, అన్ని వాణిజ్య బ్యాంకులకు చెందిన ఏ శాఖలోనైనా కానీ ఖాతా ప్రారంభించి తల్లి లేదా తండ్రి సంరక్షకునిగా సంతకం చేయాల్సి ఉంది.

2.ఒక్క బాలిక పేరిట ఒక్క ఖాతా మాత్రమే అనుమతిస్తారు. ఇద్దరు అమ్మాయిలుంటే ఇద్దరి పేరిట ఖాతా తెరవవచ్చు. తల్లిదండ్రుల నివాస, గుర్తింపు ధ్రువపత్రాలు, బాలిక పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం దరఖాస్తుతో పాటు సమర్పించాలి.

3.కనీస మొత్తం రూ.1000తో ఖాతా ప్రారంభించవచ్చు.

4.ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.1,50,000 పొదుపు చేయవచ్చును.

5. నెలకు ఒకసారి లేదా ఒక సంవత్సరంలో వీలున్నప్పుడు ఖాతాలో డబ్బులు జమ చేయవచ్చు. డీడీ లేదా చెక్కు ద్వారా మాత్రమే జమ చేయాలి. ఆన్‌లైన్ ద్వారా చెల్లించే సౌకర్యం లేదు.

6.ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 14 సంవత్సరముల వరకు ఇలా పొదుపు చేయాలి.

7. అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండిన తరువాత ఉన్నత చదువుల కోసం 50 శాతం నగదుగా తీసుకోవచ్చు, 21 8.సంవత్సరాలు పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తం నగదు చెల్లిస్తారు.

9.ఆదాయపు పన్ను సెక్షన్‌ 80 సీ ప్రకారం పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

10. 18 సంవత్సరాల తర్వాత వివాహం చేయాలనుకుంటే మొత్తం సొమ్ము తీసుకోవచ్చు.

11.ఈ పథకం కింద జమ చేసిన నగదుకు ప్రభుత్వం ప్రకటించే వడ్డీ రేట్లు, ప్రతి ఏడాదికి మారుతూ ఉంటాయి. మరింత సమాచారం కోసం మీ దగ్గర్లోని బ్యాంక్ ను కానీ పోస్టాఫీస్ ను గానీ సందర్శించండి


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved