వైఫై యూజర్లకు శుభవార్త !

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్‌ రాజ్యమేలుతున్న తరుణమిది. విషెష్ నుంచి వెడ్డింగ్ ఇన్విటేషన్ల దాకా అన్నీ స్మార్ట్‌మయమయ్యాయి. ఒకప్పుడు వైఫై అంటే కేవలం కంప్యూటర్, లాప్‌టాప్ డివైజెస్‌కే పరిమితమయింది. ఈ స్మార్ట్‌ఫోన్లు వచ్చాక వైఫై పరిధి విస్తరించింది. ఒకప్పుడు పట్టణాలకు, నగరాలకు మాత్రమే పరిమితమైన వైఫై సదుపాయం ఇప్పుడు చిన్నచిన్న పట్టణాలకు కూడా విస్తరించింది. అయితే వైఫై సర్వీస్ అందుబాటులోకి వచ్చినప్పటికీ నెట్ స్పీడ్ విషయంలోనూ, స్మార్ట్ ఫోన్ల చార్జింగ్ విషయంలోనూ యూజర్లు పెదవి విరుస్తున్నారు. వైఫైను ఉపయోగించినప్పటికీ స్మార్ట్ ఫోన్ చార్జింగ్ తొందరగా తగ్గకుండా ఉండేందుకు, బ్రౌజింగ్ స్పీడ్‌ను పెంచేందుకు వైఫై అలియన్స్ సంస్థ పరిష్కారాన్ని కనుగొన్నది.

1GHZ ఫ్రీక్వెన్సీ రేంజ్‌లో పనిచేసే విధంగా సరికొత్త ‘వైఫై హలో’ను ఆవిష్కరించింది. దీని ద్వారా వైఫై యూజర్లు గదిలో డోర్లు మూసుకున్నా కూడా స్పీడ్ ఏ మాత్రం తగ్గదు. ఈ వైఫై హాలో ఫ్రీక్వెన్సీ రేంజ్‌ 1GHZ నుంచి మరింత పెంచేందుకు విప్లవాత్మక మార్పులు చేస్తామని సంస్థ సీఈవో ఎడ్గర్ తెలిపారు. అంతేకాకుండా, వైఫై హాలోకి బేబీ మానిటర్స్, హోమ్ సెన్సార్స్ వంటి వాటిని అనుసంధానం చేసి యూజర్స్‌కు వైఫైను మరింత ఉపయోగకరంగా మారుస్తామని ఆయన చెప్పారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved