ఇంటర్నెట్ యూజర్లకు పిడుగు లాంటి వార్త చెప్పిన గూగుల్

గూగుల్ క్రోమ్ యాప్ లాంచర్ ఇక నుంచి మీకు కనిపించదు. ప్లే స్టోర్‌లో, ఇతరత్రా విధంగా కూడా మీరు గూగుల్ క్రోమ్ యాప్‌ లాంచర్‌ను డౌన్‌లోడ్ చేసుకోలేరు. ఈ సమ్మర్ నుంచి ఈ యాప్‌ను రిమూవ్ చేయాలని గూగుల్ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉందని గూగుల్ చెబుతోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఈ ఐకాన్ వల్ల ఆపరేటింగ్ స్లో అవుతోందని, బ్యాటరీ డ్రైన్ అవుతుందని తమకు ఎక్కువగా ఫిర్యాదులు అందాయని గూగుల్ ప్రతినిధులు తెలిపారు. అందువల్లే ఈ నిర్ణయానికొచ్చినట్లు చెప్పారు. గూగుల్ నిర్ణయంతో డెస్క్‌టాప్‌పై, స్మార్ట్‌ఫోన్ హోం పేజ్‌పై గూగుల్ క్రోమ్ లాంచర్ యాప్ కనుమరుగుకానుంది. జూలై నుంచి ఈ నిర్ణయం అమలు చేయాలని గూగుల్ సంస్థ భావిస్తోంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved