రికార్డుల తల్లి-నీకు వందనం

కరీంనగర్‌ లోని భగత్ నగర్ కి చెందిన కామారపు లక్ష్మి(43) అనే తొమ్మిది నెలల గర్భిణీ స్ధానిక అంబేద్కర్ స్టేడియంలో 30 నిమిషాల 20సెకన్లలో 5కిలోమీటర్లు పరుగు పూర్తి చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది. మొదటిసారి గర్భిణిగా ఉన్నప్పుడు 5 కిలో మీటర్ల పరుగు చేయడం వల్లనే సుఖ ప్రసవం జరిగిందని, రెండో కాన్పు కూడా సుఖ ప్రసవం కోసం 5కిమీ పరుగు చేపట్టి గిన్నిస్ బుక్ లో పేరు నమోదు కోసం ప్రయత్నించినట్లు లక్ష్మి తెలిపారు. ఆమె పరుగు అనంతరం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు సత్కరించి ధృవీకరణ పాత్ర అందజేశారు. గిన్నిస్ బుక్ ప్రతినిధులకు వివరాలు అందజేయనున్నట్లు తెలిపారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved