వెంట్రుకల గుట్టు తెలిసింది!

మనుషుల వెంట్రుకలకు బలం ఎలా వస్తుందో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక వెంట్రుకలో ఉండే రెండు పొరల మధ్యలో బీటా కెరెటిన్‌ అనే రసాయనం ఉంటుందని కనుగొన్నారు. బ్రెజిల్‌కు చెందిన డాక్టర్‌ వెన్సా స్టానిక్‌ అనే శాస్త్రవేత్త వెంట్రుకలను బలోపేతం చేయటం ఎలా అనే విషయంపై అత్యంత శక్తిమంతమైన ఎక్స్‌రేలను ఉపయోగించి పరిశోధనలు చేస్తున్న సమయంలో ఈ కొత్త విషయం బయటకు వచ్చింది. ఇప్పటి దాకా శాస్త్రవేత్తలు బీటా కెరెటిన్‌ అనే రసాయనం పక్షుల ఈకలలో మాత్రమే ఉంటుందని భావించేవారు. బీటా కెరెటిన్‌ వల్ల పక్షుల ఈకలు బలంగా ఉంటాయి. వెస్సా, ఆమె బృందం చేసిన పరిశోధనల్లో- వెంట్రుకలలో ఉండే లోపలి, బయట పొరల మధ్యలో బీటా కెరెటిన్‌ ఉందని తేలింది. ఈ పరిశోధనల వల్ల- కొత్త రకం షాంపులను, హెయిర్‌డైలను తయారుచేసే అవకాశముంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు

- See more at: http://www.snehahastamsociety.org/useful-articles.php

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved