హ్యాపీ దివాలీకి ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మరో రెండు రోజుల్లో దీపావళి పండుగ వస్తోంది. టపాసుల కోసం గడుగ్గాయిలు పేచీ పెట్టడం అప్పుడే మొదలైంది. దీపావళి వస్తూనే తనతో పాటు ఎంతటి ఆనందాన్ని తీసుకువస్తుందో జాగ్రత్తగా లేకపోతే అంతటి విషాదాన్నీ వెంట పెట్టుకుని వస్తుంది. ఈ దీపావళి వేళ కళ్లని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు సుజయ్‌ దంగి - చీఫ్‌ ఆప్టోమెట్రిస్ట్‌, హెడ్‌ - టెక్నికల్‌ సర్వీసెస్‌, ఐవేర్‌ డివిజన్‌, టైటాన్‌ కంపెనీ లిమిటెడ్‌. దీపకాంతుల ఈ పండుగ వేళ పెద్దవాళ్లు తోడు లేకుండా పిల్లలని టపాసుల దగ్గరకి అసలు వెళ్లనీయవద్దని చెబుతున్నారు ఎల్‌వీ ప్రసద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ డాక్టర్లు. ఈ దివాలీ వేళ ఆనందకర వాతావరణంలో టపాసులు పేల్చాలనుకుంటే ఈ జాగ్రత్తలు పాటించటం తప్పనిసరని చెబుతున్నారు సుజయ్‌, ఎల్‌వీప్రసాద్‌ సిబ్బంది.

దివాలీ ముందు ఏం చేయాలంటే..ఆథరైజ్డ్‌ మాన్యుఫాక్చరర్లు తయారుచేసిన టపాసులు మాత్రమే కొనాలి. చైనా టపాసుల జోలికి వెళ్లకపోవటమే మంచిది. అవి ఎలా పేలతాయో ఎవరికీ తెలీదు. టపాసులు కొన్న తరువాత కనీసం ఒక రోజైనా వాటిని పూర్తిగా ఎండలో ఉంచాలి

పిల్లలకి దగ్గరగా ఈ టపాసులు ఉంచకూడదు. అలాగే ఇంటిలో గ్యాస్‌ సిలెండర్‌. ఆయిల్‌ క్యాన్‌లు లాంటి వాటికి దగ్గరగా ఉంచకూడదు.

టపాసులతో పిల్లలని ఒంటరిగా అసలు ఆడనీయరాదు

దీపావళి సమయంలో.. టపాసులని ఓపెన్‌ ఏరియాలో మాత్రమే కాల్చాలి

టపాసులు వెలిగించటానికి క్యాండిల్‌ లేదంటే అగరబత్తి లాంటిది దగ్గర ఉంచుకోవాలి రెండు బకెట్ల నీళ్లు దగ్గరలో ఉంచుకోవటం మంచిది.

చేతిలో ఉంచుకుని టాపాసులు అంటించే ప్రయత్నం చేయకూడదు.

అంటించి వచ్చిన వెంటనే కొన్ని టపాసులు వెంటనే పేలవు. అలాంటప్పుడు ఏమయిందోనంటూ వాటిని పరిశీలించే ప్రయత్నం వెంటనే చేయకూడదు.

బాగా వదులుగా ఉన్న వసా్త్రలు ధరించకూడదు.

దివాలీ వేళ ప్రమాదం జరిగినప్పుడు కళ్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినప్పుడుఎక్కువ నీళ్లు పోసి ఆర్పే ప్రయత్నం చేయాలి పెద్దగా ఒళ్లు కాలినప్పుడు బాధితుడ్ని శుభ్రమైన బెడ్‌షీట్‌లో చుట్టి వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్లాలి

కళ్లని నలపకూడదు. కంటిలోపల ఏదైనా టిష్యూ చిరిగితే, కంటిని నలపటం వల్ల మరింత ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి.

కంటిలో ఏమైనా పడితే వెంటనే కడగటానికి ప్రయత్నించ కూడదు. ఇది కళ్లు నలపటం కన్నా ఇంకా ప్రమాదమైనది

ఒకవేళ కంటి లోపల గాయం అయితే నీళ్లని అసలు కంటికి తగల నీయవద్దు ఐ లిడ్‌ బర్న్‌ అయితే చల్లటి నీరు కాస్త సహాయ పడుతుంది.

ఒకవేళ కంటి లోపల నలుసు పడితే మెత్తటి వస్త్రం చివరతో వాటిని జాగ్రత్తగా తొలగించాలి లేదా కంటి రెప్పలని పట్టుకుని నీళ్లతో శుభ్రంగా కడగాలి.

ఒకవేళ నలుసు పెద్దదిఅయితే లేదా అది కంటిలోపల అది చిక్కుకుంటే దాన్ని బలవంతంగా తొలగించటానికి సిద్ధపడకూడదు.

ఒకవేళ కంటి లోపల ఏదైనా కెమికల్‌ చేరితే తక్షణమే నీళ్లతో కంటిని కడగాలి. కంటిరెప్పల కింద నీటితో కడగటం మంచిది.

కళ్లకి గాయమైనప్పుడు రక్షణగా గుండ్రటి ఆకృతి కలిగిన వస్తువు అడ్డు పెట్టుకుని డాక్టర్‌ని సంప్రదించాలి.

కంటిలోపల ఏమైనా పడితే ఇంటి చిట్కాలు ప్రయోగించ కూడదు. ఒక్కోసారి అవి ప్రమాద తీవ్రతని పెంచే ప్రమాదం లేకపోలేదు.

కాలినప్పుడు: కాలిన ఏరియాని శుభ్రం చేయాలి. ఐస్‌ వాటర్‌ మాత్రం వాడకూడదు. ఆ ప్రదేశం ఆరనిచ్చి స్టెరిల్‌ గేజ్‌ లేదా శుభ్రమైన క్లాత్‌ చుట్టాలి.

ప్రమాద తీవ్రత తక్కువ అయినప్పటికీ పండుగ అయిన తరువాత డాక్టర్‌ని సంప్రదించటం వల్ల అనుమానం నివృత్తి చేసుకోవచ్చు.

దీపావళి ప్రమాదాలు- కొన్ని నిజాలు

1. దాదాపు 40 శాతం టపాసుల ప్రమాదాలు పాదచారులు లేదంటే వాటిని చూస్తూ నిలబడ్డ వారికే జరుగుతున్నాయి

2. ప్రతి ఐదు టపాసు ప్రమాదాల్లో నాలుగు మగవారికే జరుగుతున్నాయి

3. 22-44 ఏళ్ల లోపు మగవారితో పాటుగా 12-14 సంవత్సరాల బాలురు ఎక్కువగా ఈ ప్రమాదాలకి లోనవుతున్నారు

4. బాటిల్‌ రాకెట్లు 200 మైళ్ల వేగంతో పైకి దూసుకుపోయి అక్కడ పేలతాయి. ఒకవేళ అలా జరగక పోతే అది అత్యంత ప్రమాదాన్ని కలిగిస్తుంది.

5. దీపావళి సమయంలో 6-10 శాతం కాలుష్యస్థాయి పెరుగుతుంది. నైట్రస్‌ ఆక్సైడ్‌, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌ స్థాయి ప్రమాదర స్థాయిలో పెరుగుతుంది.

దీపావళి సమయంలో అత్యవసర సహాయం కావాల్సి వస్తే ఎల్‌వీ ప్రసాద్‌ హాస్పిటల్‌ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ 040-30612100, 040-3061 2108 కి కాల్‌ చేయవచ్చు. డాక్టర్లని సంప్రదించాలనుకుంటే 93463 19984, 93475 73377 నెంబర్‌లకి కాల్‌ చేయవచ్చు

దయచేసి షేర్ చెయ్యండి ఎందుకంటే ప్రతి ఇయర్ దీవాలి కి ఎంతో మంది గాయపడుతున్నారు ఇది చదివినాక ఐన కొంత మంది జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను ప్లీజ్ షేర్ !!!


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved