కూలీ డబ్బులతో గుడి కట్టింది.

పాకాల మండలం అయ్యప్పగారిపల్లెకు చెందిన ఆంజయ్య, ఆయన భార్య చిన్నక్క 30 ఏళ్ల క్రితం సోమల మండలం చిన్నఉప్పరపల్లెకు వలస వచ్చారు. వీరికి ముగ్గురు కుమారులు ఉండగా ఇద్దరు మృతి చెందారు. చివరి కుమారుడైన కృష్ణయ్య ఉపాధి కోసం బెంగళూరుకు వలస వెళ్లాడు. భర్త అంజయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. చిన్నక్క చిన్నఉప్పరపల్లెలోనే ఉంటూ బండరాళ్లు కొట్టి జీవనం కొనసాగించేది. వంకలో ఆమెకు ఓ బండపై చెక్కిన అభయాంజనేయస్వామి ప్రతిమ కనబడడంతో ఆ బండను తన ఇంటి వద్ద ప్రతిష్టించి పూజ చేసేది. ఈ నేపథ్యంలో గొంతుపై ఉన్న వికారపు గడ్డలు మాయమవడంతో ఆమెకు స్వామిపై గురి కుదిరింది. కూడబెట్టిన రూ.30వేలతో ఇంటి ఆవరణలో ప్రతిష్టించిన అభయాంజనేయస్వామికి గుడి కట్టడం ప్రారంభించింది. తన సంపాదనతోపాటూ స్వస్థలంలో తన వాటాకు వచ్చిన భూమిని విక్రయించి మొత్తం రూ.3 లక్షలతో ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తిని చాటుకుంది. అలాగే ఆలయ ఆవరణలో రామ మందిరం, అన్నదాన సత్రం నిర్మాణాలు చేపట్టింది. యేటా హనుమాన్‌ జయంతి, శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తూ పరిసర ప్రజల మన్ననలను పొందుతోంది. అంజన్న అపరభక్తురాలికి పాదాభివందనాలు..


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved