పేపర్లో వార్తను చూసి రైతు బ్యాంక్ లోన్ కట్టిన హీరో విశాల్.. నచ్చితే Like చేయండి కుదిరితే షేర్ చేయండి

తమిళనాడు లోని తంజావూరు ప్రాంతానికి చెందిన బాలన్ అనే రైతు బ్యాంకు లోన్ తో ట్రాక్టర్ కొని వ్యవసాయం చేసుకొంటున్నాడు. కాగా చేస్తున్న వ్యవసాయంలో నష్టం రావడంతో అప్పటి దాకా చెల్లిస్తున్న రుణం తాలూకు వాయిదాలు నిలిచి పోయాయి. అలా రెండు కిస్తులు బకాయి పడ్డాడు. మరి బ్యాంక్ వారికి ఆ రైతు వేల కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించకుండా... ఆ ట్రాక్టర్ తో సహా మరి విదేశాలకు వెళ్ళిపోతాడు అనే అనుమానం వచ్చింది. వెంటనే ఆ వేల కోట్ల రుణం వసూలు చేసుకోవడానికి బ్యాంక్ అధికారులు బాలన్ ఇంటికి పోలీసులను వెంటబెట్టుకొని వెళ్లారు. ఆ రైతు బ్యాంక్ అధికారుల కాళ్లావేళ్లా పడ్డా వినకుండా.. అతని జీవనాధారమైన ట్రాక్టర్ ను తీసుకొని వెళ్లారు. కాగా ఈ వార్త తమిళ పత్రికల్లో వచ్చింది. ఈ వార్తను చూసిన హీరో విశాల్ వెంటనే స్పందించి....... ఆ బాలన్ ఎవరో నాకు తెలియదు.. కానీ అతను ఒక రైతు అవ్వడం వల్లే అతనికి ఇలాంటి పరిస్తితి వచ్చింది. ఆ విషయం నాకు అర్ధమైంది. ఆ బాకీ తాను తీరుస్తానని... మనస్థాపం చెందకండి అని విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇప్పటికే విశాల్ రీల్ హీరో కాదు రియల్ హీరో అని నిరూపించుకొన్నాడు. ఇటీవల తాను షూటింగ్ చేసే ప్రాంతంలోని గ్రామస్తుల ఇబ్బందులను గమనించి మరుగుదొడ్ల నిర్మాణానికి పూనకొన్న సంగతి విధితమే. కాగా మన తెలుగు రాష్ట్రాల్లో నష్టాలతో... అప్పులతో.. రైతులు అర్ధాంతరంగా జీవితాన్ని ముగిస్తుంటే...... మన తెలుగు హీరోలు.. కనీసం మాట సాయం కూడా చేయక పోవడం గమనార్హం... కనీసం విశాల్, రజనీ, కార్తీ వంటి తమిళ హీరోలను చూసైనా మన తెలుగు హీరోలు నేర్చుకోవాలని కోరుకుందాం...!


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved