దంతాలు లేకుండా బేబీస్ తినగలిగే 15 హెల్తీ న్యూట్రీషియన్ ఫుడ్స్....

తల్లికి ఎపుడూ బిడ్డ తినే ఆహారంపై అధిక శ్రద్ధ ఉంటుంది. బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని కోరుతుంది. అందుకవసరమైన పోషకాహారాల కొరకు ఆమె ఎంతో శ్రమిస్తుంది. బిడ్డలు చిన్నతనంలో అతి త్వరగా వ్యాధులకు గురవుతారు. కనుక తల్లులు వారికి సరైన వయసులో సరైన ఆహారాలు తినిపిస్తూ వారి ఎదుగుదలకు తోడ్పడాలి. మార్కెట్లలో లభ్యమయ్యే బేబీల ఆహారం తరచుగా జీర్ణం కానిది, ప్రాసెస్ చేసిందిగా వుంటుంది. దీనిలో ఫైబర్, కాల్షియం, విటమిన్లు వంటివి వుండవు. అంతేకాదు బయట కొనుగోలు చేసే ఈ ప్రాసెస్డ్ ఆహారాలు ఎంతో వ్యయం చేసి కొంటాము. బేబీకి పెట్టే ఆహారం ఉప్పు, కారం లేనిదిగా చప్పగా వుండాలి. మెత్తగా తయారు చేయాలి. ఇంటిలో ఆరోగ్య వాతావరణంలో ఉడికించి, మెత్తగా చిదిమి బేబీ కి ఇక ఆహారం నమిలే పని లేకుండా నోటికి అందించాలి.

తేలికగా జీర్ణమ్యేదిగా వుండాలి. అంతేకాక, అది తిన్న వెంటనే మరోమారు బేబీ ఆకలి అంటూ ఏడ్చేలా వుండాలి. బేబీకి ఇచ్చే ఆహారం బేబీ ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాలు, కేలరీలు కలిగి వుండాలి. బేబీ పుట్టిన సంవత్సరంలోపు వారికి దంతాలు ఉండువు కాబట్టి, వారికి ఆకలైనప్పుడు తల్లి పాలపట్టడం మాత్రమే కాకుండా వారికి తేలికగా జీర్ణమయ్యే స్మూత్ ఫుడ్స్ ను డిఫరెంట్ గా, టేస్టీగ్ గా అందివ్వాలి. కొన్ని నాన్ బేబీ ఫుడ్స్ ఈ క్రింది లిస్ట్ లో ఉన్నాయి. అయితే వీటిని బేబీ డైట్ లో నిరభ్యంతరంగా చేర్చుకోవచ్చు. ఇవి అత్యంత పోషకాలుగవి. ఈ ఆహారాలు నోట్లో పెట్టగానే కరిగిపోతాయి. మరి ఒక సంవత్సరంలోపు బేబీకి అందివ్వాల్సిన ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం…

సాల్మన్: సాల్మన్ ఫిష్. చాలా సాప్ట్ గా ఉంటుంది కాబట్టి, దీన్ని 7 నెలల నుండి ఆహారంగా అందివ్వొచ్చు. బేక్ చేసి మెత్తగా మ్యాష్ చేసి అందివ్వాలి. హాట్ డాగ్స్: ఖచ్చితంగా హాట్ డాగ్స్ ఇవి హార్డ్ గా ఉండవు సన్నగా కట్ చేసి, లేదా చేత్తో చిదిమి పెట్టడం వల్ల స్మూత్ గా తినేస్తారు. గ్రైండ్ చేసి చికెన్: చికెన్ స్టీవ్ బోరింగ్ ఫుడ్. అయితే గ్రైండ్ చేసి చికెన్ హెల్తీ . అంతే కాదు చాలా త్వరగా జీర్ణమవుతుంది. తున:మరో ఫిష్ తున ఫిష్, మెత్తగా ఉడికించి లేదా బేక్ చేసి అందివ్వొచ్చు . అయితే వీటిని పెట్డానికి ముళ్లు, బోన్స్ గంట్రా చూసి తొలగించాలి.గ్రైండ్ చేసిన చికెన్ వంటిదే, కొద్దిగా డిఫరెంట్ గా పొడవుగా త్రెండ్స్ వలే ఉండటం వల్ల చిన్న పిల్లలు తినడానికి ఇష్టపడుతారు.

సీఫుడ్స్ : అలర్జీలేనివారు సీఫుడ్స్ ను అందివ్వొచ్చు . అయితే సీఫుడ్ ను మెత్తగా ఉడికించి లేదా బేక్ చేసి, మ్యాష్ చేసి మితంగా అందివ్వాలి. బ్రెడ్:మిక్డ్స్ గ్రెయిన్ బ్రెడ్ లేదా ప్లెయిన్ వైట్ బ్రెడ్ ను కొద్దిగా స్నాక్ గా అందివ్వొచ్చు. ఓట్ మీల్: పిల్లలు మిగడానికి చాలా స్మూత్ గా ఉంటుంది. అంతే కాదు త్వరగా జీర్ణమవుతుంది. గోరువెచ్చని నీటితో మ్యాష్ చేసి అందివ్వాలి. ఓయిస్ట్రెస్: ను బ్రేక్ చేసి, పొడి చేసి వారిముందుర పెడితే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు.చీజ్ తో కలిపి బాగా మొత్తగా ఉడికించి కొద్దికొద్దిగా అందివ్వడం వల్ల పిల్లలు టేస్ట్ ను ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అవొకాడో: లోపల చాలా మెత్తని గుజ్జు ఉంటుంది . కాబట్టి,దీనికి కొద్దిగా అరటి పండు గుజ్జు మిక్స్ చేసి , కొద్దిగా షుగర్ జోడించి అందివ్వాలి. రైస్ పుడ్డింగ్: చాలా మెత్తగా స్వీట్ గా ఉంటుంది. కాబ్టటి, పిల్లలు ఇష్టంగా తింటుంటారు.

టమోటోస్:ఈ సలాడ్ వెజిటేబుల్ చాలా తేలికగా జీర్ణమవుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందివ్వాలి. క్రాన్ బెర్రీ సాస్ : క్రాన్ బెర్రీనుండి గుజ్జు తీసి కొద్దిగా షుగర్ జోడించి అందివ్వాలి. ఫ్రెంచ్ టోస్ట్ : రెగ్యులర్ వైట్ బ్రెడ్ ను ఎగ్ లో డిప్ చేసి పల్చగా కట్ చేసి బట్టర్ ను టాప్ గా పెట్టి మెత్తగా బేక్ చేిస బేబీకి అందివ్వాలి. ఇది అత్యంత పోషకాలున్న ఆహారం.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved