త్వరగా సన్నపడాలంటే ఈ విధంగా చేయండి చాలు


Share on

వీటిని రోజులో….50 గ్రాములైనా తినండి. క్యాన్సర్, హార్ట్ ఎటాక్ లకు దూరంగా ఉండండి!

న‌ట్స్‌… గింజ‌లు… పేరేదైనా… ఏ భాష‌లో చెప్పినా వీటిని నిత్యం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల లాభాలు క‌లుగుతాయి. ప‌లు అనారోగ్యాలు దూర‌మ‌వుతాయి. శ‌రీరానికి కావల్సిన కీల‌క పోషకాలైన విట‌మిన్స్‌, మిన‌రల్స్ అందుతాయి. అయితే న‌ట్స్ విష‌యంలో చాలా మందికి తలెత్తే ప్ర‌శ్న ఒక్క‌టే. అది… రోజుకు ఎన్ని న‌ట్స్ తినాల‌న్న‌దే..! ఎంత మొత్తంలో న‌ట్స్ తింటే శ‌రీరానికి మేలు జ‌రుగుతుందో చాలా మందికి తెలియ‌దు. దాన్నే ఇక్క‌డ చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాం..! నిత్యం మ‌నం ఏ ర‌కం న‌ట్స్ అయినా 10 గ్రాముల మోతాదులో తింటే చాల‌ట‌. దీంతో మ‌న‌కు ఆ రోజుకు కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ అందుతాయ‌ట‌. అయితే ఏదైనా ఒకే ర‌కం న‌ట్స్‌ను కాకుండా 3, 4 ర‌కాల న‌ట్స్‌ను 10 గ్రాముల మోతాదులో

వాల్‌న‌ట్స్‌…

10 గ్రాముల మార్క్‌ను చేరాలంటే వాల్‌న‌ట్స్‌ను క‌నీసం రోజుకు 5 నుంచి 6 వ‌ర‌కు తినాలి. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ త‌యార‌వుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రావు. అదేవిధంగా ఎముక‌లు దృఢత్వ పొందుతాయి. శ‌రీర మెట‌బాలిజం ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. డ‌యాబెటిస్ ఉంటే అదుపులోకి వ‌స్తుంది. గ్లూకోజ్ నియంత్ర‌ణలో ఉంటుంది. క్యాన్స‌ర్లు రావు. మ‌గ‌వారిలో అయితే వీర్యం బాగా వృద్ధి చెందుతుంది. ఆడ‌వారిలో రుతు స‌మ‌స్య‌లు పోతాయి.

బాదం ప‌ప్పు…

వీటిని నిత్యం 8, 9 తింటే చాలు. 10 గ్రాముల మోతాదుకు చేరుకుంటాం. వీటి వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్షన్లు న‌య‌మ‌వుతాయి. పురుషుల్లో ఉండే వ్యంధ్య‌త్వ స‌మ‌స్య‌లు పోతాయి. సంతానం క‌లిగేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. డ‌యాబెటిక్స్‌కు ఇది మంచిది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె స‌మ‌స్య‌లు రావు. చెడు కొలెస్ట్రాల్ పోయి, మంచి కొలెస్ట్రాల్ ఉత్ప‌న్నం అవుతుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మంచి ఆహారం. త‌క్కువ మొత్తంలో తిన్నా క‌డుపు ఫుల్‌గా ఉంటుంది.

వేరుశెన‌గ‌లు…

వీటిని మనం నిత్యం ప‌లు వంట‌కాల్లోనూ, చ‌ట్నీల్లోనూ వాడుతుంటాం. అయితే వేరుశెన‌గ‌ల‌ను న‌ట్స్ రూపంలోనూ రోజూ తీసుకోవచ్చు. 10 గ్రాముల మోతాదులో తినాలంటే వీటిని క‌నీసం 10 నుంచి 15 వ‌ర‌కు తినాలి. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ పోయి, మంచి కొలెస్ట్రాల్ త‌యార‌వుతుంది. ప్లాంట్ ఆధారిత ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి శ‌రీరానికి ఎంత‌గానో అవ‌స‌రం. క్యాన్స‌ర్లు, గుండె జ‌బ్బులు రావు. విట‌మిన్ ఇ ఉండ‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది.

పిస్తా ప‌ప్పు…

వీటిని నిత్యం 8, 9 వ‌ర‌కు తిన్నా చాలు. 10 గ్రాముల డోసుకు చేరుకోవ‌చ్చు. పిస్తా పప్పు వ‌ల్ల గుండె సమ‌స్య‌లు రావు. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మేలు చేస్తుంది. కండ‌రాల నొప్పులు త‌గ్గుతాయి. పొడి చ‌ర్మం ఉన్న‌వారు తింటే వారి చ‌ర్మం మృదువుగా మారుతుంది. పీచు ఉండ‌డం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ఠ‌మ‌వుతుంది. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. ర‌క్త‌హీన‌త‌ను నివారిస్తుంది.

జీడిప‌ప్పు…

జీడిప‌ప్పును రోజుకు 6,7 తిన్నా 10 గ్రాముల మోతాదుకు సుల‌భంగా చేరుకోవ‌చ్చు. దీని వ‌ల్ల గుండె సంబంధ వ్యాధులు రావు. చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. ర‌క్తం శుద్ధి అవుతుంది. ర‌క్త‌హీన‌త పోతుంది. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. కంటి స‌మ‌స్య‌లు రావు. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

పైన్ న‌ట్స్‌…

వీటిని నిత్యం 12 నుంచి 14 తింటే దాంతో 10 గ్రాముల కోటా పూర్త‌వుతుంది. పైన్ న‌ట్స్ వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. రోజంతా శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి అందుతుంది. గుండె సంబంధ స‌మస్యలు రావు. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే ముడ‌తలు త‌గ్గిపోతాయి. య‌వ్వ‌నంగా కనిపిస్తారు. కంటి స‌మ‌స్య‌లు పోతాయి. చూశారుగా… న‌ట్స్ వ‌ల్ల ఎంత‌టి అద్భుత ఫ‌లితాలు వ‌స్తాయో… పైన చెప్పిన అన్నింటినీ నిర్దేశించిన విధంగా రోజూ 10 గ్రాముల మోతాదులో తింటూ ఉంటే దాంతో మీ ద‌గ్గ‌రికి అనారోగ్యాలు రావు. ఇక మీరు డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే రాద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు..!


Share on

పాదాలు అందంగా ఉండాలంటే..ఇలా చేయండి..!!

మీ పాదాలను కొన్ని గంటల పాటు తోలు బుట్లలలో చుట్టి ఉంచడం వలన అవి ఎలా ఉంటాయో ఎపుడైనా ఆలోచించారా? నిజానికి, అవి ఒక నరకంలో ఉన్న భావనకు లోనవుతాయి. చాలా మంది పాదాల గురించి అస్సపు ఆలోచించరు. పాదాలకు మర్ధన అనగానే బహుశా మీ జేబుకు చిల్లు పడినట్లే అన్న భావన మనసులో మొదలవుతుంది. అయితే ఇంట్లోనే దశల వారీగా ఆయుర్వేద మర్ధన మార్గనిర్దేశకాల సహాయంతో మీ పాదాలకు సౌకర్యవంతమైన అనుభూతిని అందించవచ్చు.

మీ పాదాలు మృదువుగా ఉండాలంటే.. బయటే కాక ఇంట్లో ఉన్నప్పుడూ చెప్పులేసుకోవడం తప్పనిసరి. ఇంటిలోపల, ఇంటి వెలుపలికి వేరు వేరు చెప్పులు వాడటం మంచిది. అలాగే స్నానం చేసేటప్పుడు రెండు నిమిషాలు అదనంగా పాదాల కోసం కేటాయించి పాదాలను రుద్దుకుంటే అరికాలిలో ఉన్న మట్టి తొలగిపోయి పాదం మృదువుగా తయారవుతుంది.

పాదాల శుభ్రత కోసం ఫ్యాన్సీ, బ్యూటీ పార్లర్లలో ఓ రాయిని అమ్ముతుంటారు. వీటిని కూడా వాడొచ్చు. రాత్రిపడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు ఉన్న మట్టి, సూక్ష్మజీవులుపోయి కాలు శుభ్రపడి పాదాలకు వచ్చే ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసుకోవచ్చు.

వేళ్లమధ్యలో ఉన్న తేమను గుడ్డతో తుడుచుకుని, తడి ఆరిన తరువాతే పడుకోవాలి. అలాకాని పక్షంలో వేళ్ల మధ్యలో ఫంగస్‌, అంటువ్యాధులు సోకే అవకాశముంది. క్రమం తప్పకుండా కాలిగోళ్లను కత్తిరించుకోవాలి. గోళ్లను ఏమాత్రం పెరగనివ్వకూడదు.

రోజూ కనీసం అరగంట నడవాలి. నడక కాలికి మంచిది. రక్తప్రసరణ పెంచుతుంది. తద్వారా అనేక రకాల పాదాల వ్యాధులను నివారించవచ్చునని బ్యూటీషన్లు అంటున్నారు. మీకు కావాల్సిన వస్తువులు ఒక చిన్న టబ్ లో వెచ్చని నీటిని, కొంచెం అల్లం, ఉప్పు, పాదాలను తుడవడానికి ఒక టవల్ మరియు మర్ధన చేయడానికి ఎంపిక చేసుకున్న నూనె (కొబ్బరి నూనె, నువ్వులు లేదా ఆవాల నూనె). కానీ, వేసవి కాలంలో ఆవాల నూనె వాడకూడదు ఎందుకంటే అది శరీరంలో వేడిని ఉత్పత్తి చేయవచ్చు.

మీ పాదాలను టబ్ నుండి భయటకు తీయాలి మరియు వాటిని పొందికగా ఆరనివ్వాలి. ఇపుడు కొంచెం నూనె తీసుకొని మీ పాదాలకు పట్టించాలి అయితే మర్ధన చేసేపుడు చేతులకి మరియు కాళ్ళకి మధ్య రాపిడి చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ప్రతి పాదానికి సుమారు 15 - 20 నిమిషాల పాటు మర్ధన చేయాలి. మసాజ్ ఎలా చేయాలో కింద వివరించడం జరిగింది.

మీ చేతి వేళ్ళతో చీలిమండలాల చుట్టూ వృత్తాకారంగా కదుపుతూ ప్రారంభించాలి. ఇపుడు మీ బ్రొటన వేళ్ళ సహాయంతో, మడమ నుండి పిక్క కండరాలను నెమ్మదిగా కింది వైపుగా కదులుతూ నొక్కాలి. చీలిమండల క్రింది భాగానికి మరియు కాలి వేళ్ళకి మధ్య భాగానికి మర్ధన చేయాలి. మీ చేతి బ్రొటన వేలు మరియు చూపుడు వేలును ఉపయోగించి ప్రతి కాలి వేళ్ళ మధ్య ప్రాంతంలో మర్ధన చేయాలి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved