కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే...

శరీరంలో చురుకుదనం కోసం ఉదయాన్నే ఎక్సర్‌సైజ్‌లు చేస్తాం. అయితే కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం చాలా మంది ఆలోచించరు. విధుల్లో ఉన్నప్పుడు కంటి నుంచి నీరు కారటం లాంటివి జరుగుతుంటే ఐ ఎక్సర్‌సైజ్‌లు చేయాల్సిందే. అవెలాగో తెల్సుకుందాం.

ముక్కుకి పది సెంటీమీటర్ల దూరంలో చేయి బొటనవేలు ఉంచాలి. ఆ బొటనవేలుని చూస్తుండాలి. తర్వాత క్రమంగా బొటనవేలును పైకి తీసుకెళుతూ చూస్తుండాలి. చివరికి బొటనవేలును చూడలేని స్థితి వస్తుంది. అప్పుడు రెండు సెకన్ల పాటు స్ట్రయిట్‌గా చూడాలి.

తర్వాత మళ్లీ బొటనవేలును క్రమంగా ముక్కుదగ్గరకు తీసుకొస్తూ ఆ బొటనవేలును చూస్తుండాలి. యథాస్థితికి వచ్చాక కళ్లు కాసేపు మూసుకోవాలి.

బొటనవేలును తలకు అన్ని వైపులా వివిధ ఇమాజినరీ పాయింట్స్‌ వద్ద ఉంచుతూ కళ్లతో చూస్తుండాలి. ఇలా రోజుకు రెండు నుంచి నాలుగుసార్లు ఈ ఎక్సర్‌సైజ్‌ చేస్తే కళ్లకు మంచిది.

ఐ బాల్స్‌ ఎక్సర్‌సైజ్‌లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ఎక్సర్‌సైజ్‌ చేసే ముందు మొదట కళ్లను రెండు చేతులతో మూసేయాలి. రెప్పలపై మరీ ఒత్తిడి చేయకూడదు. కనుగుడ్లను ఎడమ నుంచి కుడికి, పైనుంచి కిందకు, క్లాక్‌ వైజ్‌, యాంటీ క్లాక్‌వైజ్‌ తిప్పాలి. ఇలా పదిసార్లు ఐ బాల్స్‌ ఎక్సర్‌సైజ్‌ చేయాలి.

కొద్దిసేపు పేపర్లు, పుస్తకాలు చదవాలి. ఇలా చేస్తే చివరికి కళ్లు అలసిపోతాయి. ఆ తర్వాత మంచి ఫలితం కళ్లముందే కనిపిస్తుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved