ఇక నుండి గుంటూరులో గుండెలు మారుస్తారు

గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజి హెచ్) లో గుండెల మార్పిడి శస్త్ర చికిత్సల నిర్వహణ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో కేవలం హైదరాబాద్ లోనే ఉన్న ఈ సదుపాయాన్ని నవ్యాంధ్రలో తొలిసారి గుంటూరులో ప్రారంభించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం (పీపీపీ)విధానంలో ఇప్పటికే జిజిహెచ్ లోబైపాస్ సర్జరీలు విజయవంతంగా జరుగుతున్నాయి. ఇదే విధానంలో అక్టోబర్ నుంచి గుండె మార్పిడి శస్త్ర చికిత్సలను నిర్వహించాలని ఈ శస్త్ర చికిత్సలో పేరు గాంచిన నిపుణుడు గోపాలకృష్ణ గోఖలే బృందం అభిప్రాయపడుతోంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved