గుండెపోటు - లక్షణాలు...

సుమారు అరవై శాతం పైగా గుండె నొప్పి లక్షణాలు, గుండెపోటు సంభవించక ముందే వారికి అనుభవం అవుతాయని ఒక పరిశీలన లో తెలిసింది. కానీ తరచూ ముందుగా వచ్చే ఈ లక్షణాలను పట్టించుకోక అశ్రద్ధ చేస్తారని కూడా పరిశీలనలో తెలిసింది.గుండె నొప్పి ఎట్లా ఉంటుంది: గట్టిగా పిండినట్టు, తీవ్రమైన ఒత్తిడితో ఉంటుంది. ఇలాంటి నొప్పి ఛాతీకి మధ్యలో ఉంటుంది. కొద్ది నిమిషాలు ఉండవచ్చు ఈ నొప్పి. గుండె వేగంగా కొట్టుకోవడం అంటే సాధారణంగా కొట్టుకునే వేగం కన్నా ఎక్కువగా కొట్టుకుంటుంది. డిస్కంఫర్ట్‌: గుండె నొప్పి తో పాటు చాలా డిస్కంఫర్ట్‌ కూడా వీరు అనుభవించవచ్చు.

మిగతా భాగాలలో నొప్పి: లోపలి కడుపు భాగంలో నొప్పి, ఈ నొప్పి పైభాగంలో ఉన్న గుండె నొప్పి కలిగించే ఒత్తిడి వల్ల, క్రింద ఉన్న పొట్ట లేక జీర్ణాశయంలో ఉన్నట్టు అని పించవచ్చు. అందుకనే ఇలాంటి నొప్పిని అ శ్రద్ధ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి నొప్పిని రిఫర్ద్‌ పెయిన్‌ అంటారు. (referred pain). ఎలాంటి నొప్పి భుజా లకూ ప్రత్యేకించి ఎడమ భుజానికీ, ఎడమ చేయికీ, ఎడమ ముంజేతికీ పాకవచ్చు. అలాగే వీపు భాగానికీ, రెండు చేతి రెక్కల మధ్య భాగానికీ పాకవచ్చు అంటే (between the shoulder blades). ఇలా గుం డెలో మొదలైన నొప్పి శరీరం లో మిగతా భాగాలకు పాకటానికి కారణం, గుండెకు మిగతా శరీర భాగాలకు నొప్పిని తెలియ చేసే నాడులు ఒకటే అవటం వలన. ఊపిరి అంద కపోవడమూ, కళ్ళు తిరిగినట్టూ, తల తిరిగినట్టూ, ఆత్రుతగా ఉండడం, వాంతులు రావడమూ, ఒళ్ళు చమటలు పట్టడమూ, తిన్న ఆహారం అరగనట్టు అనిపించడము కూడా జరగవచ్చు.

ఈ లక్షణాలు, సాధారణంగా కనిపించేవి. కానీ హార్ట్‌ ఎటాక్‌ లేక గుండె పోటు లక్షణాలు కొద్ది తీవ్రత నుంచి, చాలా తీవ్రతతో ఉండి విపరీతమైన నొప్పి కూడా కలిగించవచ్చు. అలా కాకుండా, పురుషులలో సుమారు నాలుగోవంతు కేసులలో, ఈ లక్షణాలు ఏవీ లేకుండా కూడా సంభవించవచ్చు. దానిని సైలెంట్‌ మయోకార్డియల్‌ ఇంఫార్క్షన్‌ అని అం టారు. ఎందుకంటే అది ఏ రకమైన ముందు లక్షణాలూ చూపించకుండా నిశ్శబ్దంగా వస్తుంది కాబట్టి. అందువల్లనే ఛాతీలో నొప్పి ఎప్పుడు వచ్చినా, లేక అనుమానంగా ఉన్నా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి

అందరికి షేర్ చెయ్యండి....please

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved