కుంకుమ బొట్టు – కుంకుమను ఏ వేలితో నుదిటిన పెట్టుకోవాలి

మన శరీరంలో ప్రతి భాగం లో ఒక్కో అది దేవత ఉంటాడట. లలాట అది దేవత బ్రహ్మ. లలాటం బ్రహ్మ స్థానం. బ్రహ్మ దేవుడి దేహం రంగు ఎరుపు. అందువల్ల బ్రహ్మ స్థానం అయిన లలాటాన స్థానం లో ఎరుపు రంగు బొట్టు ధరించాలి. అంటే పవిత్ర కుంకుమ ధరించాలి. లలాటాన స్థానం లో సూర్య కిరణాలు తాకరాదు.

కుంకుమను ఉంగరం వేలితో నుదిటిన పెట్టుకుంటే మనః శాంతి,మానసిక ప్రశాంతి చేకూరుతుంది.
నడివేలుతో పెట్టుకుంటే దీర్గాషు . బొటన వేలితో పెట్టుకుంటే శరీరం చురుకు గా పనిచేసే శక్తి వస్తుంది. చూపుడు వేలుతో పెట్టుకుంటే బగవంతునిపై భక్తి, జన్మ ముక్తి కలుగుతాయి.

బొట్టు బిళ్ళలు వంటివి కాకుండా కుంకుమ ధరిస్తేనే మంచిది. స్త్రీలు లేదా పురుషులు ఎప్పుడైతే నుదుటున కుంకుమను ధరిస్తారో వారు జ్ఞాన చక్రాన్ని పూజించిన పుణ్యము వస్తుందట .

కుంకుమ బొట్టు – సింధూర తిలకం
అందం సౌభాగ్యం రంగరించిన బొట్టు
పడతికి అందం సింధూరం
హిందూ సంప్రదాయ దేవుళ్ళ పూజకు అర్చన కుంకుమ
స్ర్తీ, పురుష భేదమెరుగక నుదుటున దేవుని కుంకుమ
సంప్రదాయమైన, సౌందర్యమైన అతివల అందమైన అలంకరణ సింధూరపు బొట్టు
భారతీయ వనితల ప్రత్యేకతను తెలుపునకు నుదుటున అందమైన సింధూరపు తిలకం
ఐదవ తనానికి సంకేతం పాపిట్లో కుంకుమ
పిలుపుకు ఆహ్వనమైన వీడ్కోలు పలుకుతూ
మళ్ళీ రమ్మని ముత్తైదువుకు కనుబొమ్మల మధ్యన కుంకుమ బొట్టు
పేద, గొప్ప భేధము లేక మర్యాదకు ప్రతీక కుంకుమ
అన్నింటి కంటే అధిక ధనమనిపించు కుంకుమ బొట్టు
మన భారతీయ సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శణం ఈ బొట్టు
హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యం ఈ బొట్టు


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved