కేవలం ఒక్క నిమిషంలోనే ATM పిన్ నంబర్ ను ఇలా చేంజ్ చేసుకోండి

ఇప్పుడున్న పరిస్థితుల్లో ATM కార్డు ఉంటేగానీ పని జరిగేట్టు లేదు. అయితే పిన్ నంబర్ మర్చిపోతే.. ఇబ్బందులు తప్పవు. ఏం చెయ్యాలో తెలియక టెన్షన్ పడుతుంటారు వినియోగదారులు. ఈ ఇబ్బందుల నుంచి ఈజీగా బయటపడొచ్చు అంటున్నారు నిపుణులు. క్షణాల్లోనే ATM పిన్ నంబర్ మార్చుకోవచ్చని చెబుతున్నారు. దగ్గర్లోని ATM మెషీన్ దగ్గరకు వెళ్లి.. నిమిషంలోనే పిన్ మార్చుకోవచ్చు సూచిస్తున్నారు.

ఇలా చేస్తే సరి.. నిమిషంలోనే ఛేంజ్

… ATM కార్డ్ ఎంటర్ చెయ్యాలి.
… కింద ఉండే ఛేంజ్ పిన్ సెలక్ట్ చేసుకోవాలి.
… కొత్త పిన్ నంబర్ టైప్ చెయ్యాలి.
… కొత్త నంబర్ మళ్లీ టైప్ చెయ్యాలి.
… ఓకే

పాత విధానం..

… ATM మెషిన్ లో కార్డు పెట్టాలి. బ్యాంకింగ్‌ ఆప్సన్లు ఎంపిక చేసుకోవాలి.
… ఛేంజ్ పిన్‌ లేదా ATM పిన్‌ రీసెట్‌ సెలక్ట్ చేసుకోవాలి.
… క్లిక్‌ చేసిన తర్వాత బ్యాంకు అకౌంట్ నంబర్ టైప్ చేయాలి. రిజిస్టర్డ్ ఫోన్‌ నెంబర్‌ను టైప్‌ చేయాలి.
… దీంతో ఫోన్ కు ఓటీపీ(ఒన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌) వస్తుంది. ఈ నెంబర్‌ను ఎంటర్‌ చేయగానే చేంజ్‌ పిన్‌ నెంబర్‌ అన్న ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
… దానిలో కొత్త పిన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చెయ్యాలి. ఆ నెంబర్‌ తిరిగి యాక్టివేట్‌ అవుతుంది


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved