మీ ఫోన్ నుంచే రిలయన్స్ జియో సిమ్ పొందడం ఎలా..?

రిలయన్స్ జియో పేరుతో మార్కెట్లో 4జీ సునామినే సృష్టించింది. 90 రోజుల అన్ లిమిటెడ్ డాటాతో పాటు ఇంటర్నెట్ ఫోన్ కాల్స్ ప్రీగా పొందవచ్చని కంపెనీ చెబుతోంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా జియో సిమ్ ని ఎలా పొందాలి. షో రూంకి వెళ్లకుండా జియో సిమ్ ని బుక్ చేయడం ఎలా అనే సందేహాలు చాలామందికి వస్తాయి. ఆండ్రాయడ్ లోఫోన్ ద్వారానే జియో సిమ్ ను పొందాలనుకునే వారు కొన్ని స్టెప్ లు ఫాలో అయితే చాలు..అవేంటో ఓ సారి చూద్దాం.

స్టెప్ 1: మొదటగా మీ స్మార్ట్ ఫోన్ నుండి గూగుల్ ప్లే స్టోర్ లోకెళ్లి మై జియో యాప్స్‌ని డౌన్ లోడ్ చేసుకోవాలి.

స్టెప్ 2: తరువాత జియో యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మై జియో యాప్ కూడా ఆ యాప్స్‌లో ఉంటుంది.

స్టెప్ 3: ఇప్పుడు బ్లూటూత్ వైఫై డేటా కనెక్షన్ ఆఫ్ చేయండి. దాంతో పాటు మై జియో యాప్‌ని కూడా క్లోజ్ చేయండి.

స్టెప్ 4: తరువాత వైఫై అండ్ డేటా కనెక్షన్ ఆన్ చేసి మై జియో యాప్ ని ఓపెన్ చేయండి

స్టెప్ 5: అలా ఓపెన్ చేయగానే మీకు గెట్ జియో సిమ్ అనే ఆప్సన్ కనిపిస్తుంది.

స్టెప్ 6: దాని మీద క్లిక్ చేసి అక్కడ కనిపిస్తున్న ఇనస్ట్రక్షన్స్ ఫాలో అయితే చాలు.

స్టెప్ 7: మీకు దగ్గర్లో జియో సిమ్ లేకపోతే అక్కడ మీరు నియర్ బై అనే ఆప్షన్ వెతకండి. మీకు దగ్గర్లో జియో సిమ్‌లు ఎక్కడ అందుబాటులో ఉంటాయో చూపిస్తుంది.

స్టెప్ 8: మీకు వెంటనే ఓ క్యూఆర్ కోడ్ మీ మొబైల్ కి జనరేట్ అవుతుంది. అంటే మీ పేరున సిమ్ హోల్డ్ లో పెడతారు అక్కడ.

స్టెప్ 9: మీరు షో రూమ్ కెళ్లి ఆ కోడ్ ని చూపించి అక్కడ కొన్ని డాక్యుమెంట్లను సబ్‌మిట్ చేస్తే మీకు జియో సిమ్ సొంతమవుతుంది


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved