బరువు తగ్గడానికి డైట్ మరియు ఈటింగ్ హ్యాబిట్స్ లో మార్పులు..

అలవాటు ప్రకారం ప్రతీ సారీ ఒకే షాపు లో సరుకులు కొనుక్కుంటూ, ఒకే రకమైన ఆహారం తినడానికి అలవాటు పడి ఉన్నారా? అయితే మీరు కూడా చాలా మంది పెద్ద వాళ్ళ లాగే ఆలోచిస్తున్నట్లే.కానీ మీ జీవన విధానం లో చిన్న చిన్న మార్పులు చేసుకుని బరువు తగ్గా లనుకుంటే మాత్రం పాత అలవాట్లని వదిలిపెట్టాలి.

ఒకే రకమైన మూస కి అలవాటు పడి ఉంటే కొన్ని ప్రాధమికమైన మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మీ వెయిట్ లాస్(బరువు తగ్గే) కార్యక్రమాన్ని మొదలు పెట్టవచ్చు. మీరు బరువు తగ్గాలనుకుంటే ఆహారం లో అలవాట్లలో చేసుకోవాల్సిన మార్పుల గురించి క్రింద ఇచ్చాము చూడండి. మీ అహారపు అలవాట్లని,ఆహారాన్ని ఎలా మెరుగు పరచుకోవాలి

1.మీ చెడు అలవాట్లేమిటో తెలుసుకోండి

మీకు చెడు అలవాటు ఉంది అని ఒప్పుకోవడం మొదటి మెట్టు. దానిని వదిలించుకోవడానికి మార్పులు చేసుకునే ముందు అసలు మీరు ఏమి తప్పు చేస్తున్నారో తెలుసుకోవడం చాలా ముఖ్యం.చెడు ఆహారపు అలవాట్లు అనుకున్న వాటినన్నింటినీ ఒక లిస్టు రాసుకుని వాటికి గల ఖచ్చితమైన కారణాలేమిటో గుర్తించండి.ఉదాహరణకి మీరు మధ్య రాత్రులు ఫ్రిజ్ మీద దాడిచేస్తున్నారంటే, ఇన్ సోమ్నియా(నిద్ర లేమి),ఒత్తిడి, రాత్రి భోజనం సరిగ్గా తీసుకోకపోవడం కారణాలు.

2.ఒక్కో మెట్టూ ఎక్కండి

మీలో చాలా సంవత్సరాలనుండీ పేరుకుపోయిన చెడు ఆహారపు అలవాట్లని దిగ్విజయం గా వదిలించుకోవాలంటే ఒక్కొక్క అలవాటు మీద దృష్టి పెడితే విజయం సాధించడానికి అధిక అవకాశాలున్నాయి.సోడా, జ్యూసులు, వేపుడు పదార్ధాలు, ఎక్కువ కార్బో హైడ్రేట్లున్న భోజనం తీసుకోవడం, చక్కెర శాతం ఎక్కువ ఉన్న ఆహారం,బద్ధకం గా కూర్చోవడం ఇలా అన్నింటినీ ఒక్కసారిగా వదిలించుకోవడం వినడానికి బాగానే ఉంటుంది.కానీ అలా కట్టుబడి ఉండటం కష్టం కనుక ఒక ప్రణాళిక వేసుకుని ఒక్కో అలవాటునీ త్యజిస్తూ ముందుకెళ్ళాలి.

3.తగినంత నిద్ర

ఈ ఉరుకుల పరుగుల ప్రపంచం లో తగినంత నిద్ర దొరకడం కష్టం.రాత్రి పూట తగినంత నిద్ర లేకపోవడం వల్ల ఆందోళన, అలసట వచ్చి ఈ రెండింటివల్లా మీరు అతిగా తినడం,కెఫీన్ లేదా చక్కెర ఎక్కువ ఉన్న పదార్ధాల మీద దాడి చేసే అవకాశం ఉంది.కనీసం రోజూ రాత్రి పూట 7-8 గంటలు నిద్రపోయేటట్లు చూసుకోండి. నిద్ర లేమి సమస్య ఎదురైయితే మీ వైద్యుడిని సంప్రదించండి.ఒక వేళ ఏ రోజైనా మీకు పని ఎక్కువ గా ఉంటే మధ్యలో చిన్న కునుకు తీస్తే ఒత్తిడి తగ్గి అతి ఆకలి పుట్టడం జరగదు.

4.అల్పాహారం తో మీ రోజుని ప్రారంభించాలి

మీకు ఉదయం అల్పాహారాన్ని దాటవేసే అలవాటు ఉంటే అది మానుకుని రోజులో అతి ముఖ్యమైన భోజనమైన ఉదయపు అల్పాహారంతో మీ రోజుని ప్రారంభించండి.ఉదయపు వేళల్లో అల్పాహారం తినేవారు తినని వారికంటే త్వరగా బరువు తగ్గుతారని నిరూపించబడింది.ఫైబర్ అధికం ఉండే చియా సీడ్స్,ఫ్లాక్స్ సీడ, ఓట్స్,పళ్ళని అధికం గా తీసుకోవడానికి ఉదయపు అల్పాహార సమయం అనువైనది.ఒక వేళ మీకు పొద్దున్నే ఏమీ తినాలనిపించకపోతే ఆకు కూరలతో చేసిన గ్రీన్ స్మూతీ ఒక మంచి ఎంపిక.

5.నీళ్ళు అధికం గా తాగడం

ఇది చిన్న విషయం లా అనిపించచ్చు కానీ మీరు తీసుకునే మంచి నీటి పరిమాణాన్ని పెంచడం ద్వారా ఆరోగ్య కరమైన అలవాట్లకి మీరు దగ్గరవుతారు.మీకు నీళ్ళు చప్పగా అనిపిస్తే కాసిని నిమ్మ కాయలు,నారింజ లేదా దోసకాయలు వేసి ఆ నీటిని తాజా గా మార్చండి.నీరు అధికం గా తీసుకోవడం వల్ల మీ శక్తి స్థాయిలు పెరిగి అలసట ని,తినాలన్న కోరిక ని తగ్గిస్తుంది. ఇంకా మీ చర్మానికి తగినంత తేమని కూడా అందించి చర్మ ఆరోగ్యాన్ని మెరుపరచడమే కాకుండా డీ హైడ్రేషన్ కి గురి కాకుండా కాపాడుతుంది.

6. ఎక్కువ లీన్(క్రొవ్వు లేని) ప్రొటీన్స్ ని తీసుకోవడం

మీ భోజనం లో లీన్ ప్రోటీన్ ని భాగం చేసుకోవడం ద్వారా మీ కొత్త ఆహారపు అలవాట్లని ప్రారంభించండి.చికెన్ బ్రెస్ట్,నట్స్, గ్రుడ్లు వంటివాటిల్లో ప్రొటీన్ అధికం గా ఉండి అవి తిన్నాకా,మీకు చాలా సేపు ఆకలి వెయ్యదు

7.చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని అవి సాధించినప్పుడు మిమ్మల్ని మీరు అభినందించుకోండి

చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటూ మిమ్మల్ని మీరు ఉత్తేజ పరచుకుంటూ మీ ఆహారం లో మార్పులు చేసుకోండి. లక్ష్యాలని చేరుకున్నప్పుడు మీకు మీరే చిన్న చిన్న బహుమతులిచ్చుకోండి. కానీ ఆ బహుమతి తిండి పదార్ధం కాకుండా చూసుకోండి సుమా.ఉదాహరణకి ఓ 5 కిలోలు తగ్గాకా ఒక కొత్త డ్రెస్ కొనుక్కోండి.ఒక నెలంతా సోడా తాగకుండా ఉన్నారకుంటే స్పా కి వెళ్ళండి లేదా ఒక వారమంతా మానకుండా వ్యాయామం చేస్తే చక్కగా పెడిక్యూర్ చేయించుకోండి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved