ట్రూకాలర్‌కు ఇలా చెక్‌

ట్రూకాలర్‌.. అపరిచితుల కాల్స్‌ను ఛేదించే యాప్‌ ఇది. ఈ యాప్‌ ద్వారా మనకువచ్చే అన్‌నోన్‌ నంబర్స్‌ డిటెయిల్స్‌ కనుక్కోవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే కొందరు అపరిచితులు ఈ యాప్‌ సాయంతో నెంబర్ల వివరాలు సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా బెదిరింపులకు దిగుతున్నారు. క్లౌడ్‌ సోర్స్‌లోని డేటాబేస్‌ ఆధారంగానే ట్రూకాలర్‌ వివరాలు అందిస్తుంటుంది. ఇలాంటి వారికి మీ నంబర్‌ చిక్కకుండా ఉండాలంటే ఈ టిప్స్‌ ఫాలో అయిపోండి.

ట్రూకాలర్‌ అకౌంట్‌ ఉన్నవాళ్ల కోసం..

ఆండ్రాయిడ్‌ ఫోన్స్‌..

ట్రూకాలర్‌ యాప్‌ ఓపెన్‌ చేసి.. పైన ఎడమవైపు చివరన ఉండే పీపుల్‌ ఐకాన్‌ను ట్యాప్‌ చేయండి.. తర్వాత సెట్టింగ్స్‌లోని అబౌట్‌ ఆప్షన్‌లోకి వెళ్లి డియాక్టివేట్‌ అకౌంట్‌ క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

ఐఫోన్స్‌..

ట్రూకాలర్‌ యాప్‌ ఓపెన్‌ చేసి పైన కుడివైపు చివరన ఉండే గేర్‌ ఐకాన్‌ను ట్యాప్‌ చేయండి. అందులో అబౌట్‌ ట్రూకాలర్‌ ఆప్షన్‌లోకి వెళ్లి స్ర్కోల్‌ డౌన్‌ క్లిక్‌ చేసి తర్వాత డియాక్టివేట్‌ ట్రూకాలర్‌ ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేయండి.

ట్రూకాలర్‌ అకౌంట్‌ డియాక్టివేట్‌ చేశాక అందులో నుంచి మీ ఫోన్‌ నంబర్‌ను తొలగించాలి. అదెలాగంటే..

1. ట్రూకాలర్‌ అన్‌లిస్ట్‌ పేజ్‌లోకి వెళ్లాలి.

2. మీ ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయండి.

3. ఎందుకు అన్‌లిస్ట్‌ చేయాలనుకుంటున్నారో కారణాన్ని తెలియజేయండి.

4. వెరిఫికేషన్‌ కాప్చా ఎంటర్‌ చేయండి.

5. అన్‌లి్‌స్టపై క్లిక్‌ చేయండి.

ఈ రిక్వెస్ట్‌ అందిన ఇరవైనాలుగు గంటల్లో మీ నంబర్‌ ట్రూకాలర్‌ లిస్ట్‌ నుంచి పూర్తిగా తొలిగిపోతుంది. లేనిపక్షంలో ట్రూకాలర్‌ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించవచ్చు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved