స్మార్ట్‌గా జాబ్ సెర్చ్ చేయండి

ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నారా? అయితే స్మార్ట్‌గా వెతకండి. ఆన్‌లై న్‌లో జాబ్‌సెర్చ్‌ ఎలా చేయాలంటే..

ఇంటర్‌నెట్‌లో ఉద్యోగం వెతికేప్పుడు మీ అసలు పేరుతోనే వెదకండి. ఎఫ్‌బి, ట్విట్టర్‌లలోను మీ అసలు పేరునే వాడండి. జాబ్‌సైట్లలోను మీ పేరుతోనే నమోదు అవ్వండి. అది మీ ఉద్యోగ అన్వేషణకు మంచి చేస్తుంది.

ట్విట్టర్‌లాంటి సోషల్‌ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవ్వాలంటే విలువైన అభిప్రాయాలను, సమాచారాన్ని పెట్టాలి. అప్పుడే మీ స్నేహితులు, ఇండసీ్ట్ర ప్రొఫెషనల్స్‌, కొలీగ్స్‌ మీ సమాచారం పట్ల ఆసక్తిగా ఉంటారు. వారితో రిలేషన్‌ ఏర్పడుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు తెలుస్తాయి.

ట్విట్టర్‌, ఎఫ్‌బిలలో మీరు ఉద్యోగ అన్వేషణలో ఉన్నట్లు ఇతరులకు తెలిసేలా చేయాలి. మీకు నచ్చిన జాబ్‌ అడ్వర్‌టైజ్‌మెంట్ల లింక్‌లు కూడా ఇవ్వొచ్చు.

మీరు డిజిటల్‌, విజువల్‌ సీవీని ప్రిపేర్‌ చేసుకోవాలి. ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు సోషల్‌ మీడియాలో పోస్టు చేయొచ్చు. ఇతరులు తక్షణమే చూసేందుకు వీలవుతుంది.

మీరు ఉద్యోగం చేయాలనుకున్న రంగానికి చెందిన లీడర్లు, ప్రొఫెషనల్స్‌ను తరచూ ఫాలో అవుతుండాలి. అప్పుడు ఆ ట్రెండ్స్‌ మీకు తెలుస్తాయి. వీలైతే సున్నితమైన కామెంట్లు కూడా పెట్టొచ్చు.

ఇండసీ్ట్ర ప్రొఫెషనల్స్‌ ట్వీట్లకు మీరు రీ ట్వీట్లు పెట్టేప్పుడు సున్నితంగా, హుందాగా వ్యవహరించండి. వివాదాస్పద వ్యాఖ్యల జోలికి వెళ్లొద్దు. సమతుల్యత పాటించండి.

సోషల్‌ మీడియాలో కెరీర్‌ గురూ్‌సను కూడా అనుసరించండి. మీ ఉద్యోగ అన్వే షణ వాళ్లకు తెలిసేలా ప్రయత్నించండి. అవసరమైతే సహాయం తీసుకోవచ్చు.

సోషల్‌గ్రూ్‌ప్సలో చేరినప్పుడు మీ జాబ్‌ సెర్చ్‌కు మార్గం చూపించే వారిని మిత్రులుగా చేసుకోండి. మీ సీనియర్స్‌ మీకు ఎంతో హెల్ప్‌ అవుతారు. సలహాలతో పాటు మార్గం చూపిస్తారు.

మీరు ఏ ఉద్యోగం అయితే చేయాలనుకుంటున్నారో.. అలాంటి ఉద్యోగులను గుర్తించి.. ఎఫ్‌బిలో ఫ్రెండ్‌ రిక్వె్‌స్టలు పంపొచ్చు. ఆన్‌లైన్‌లో కొంతమంది పోగయ్యాక మీకెంతో ప్రయోజనం చేకూరుతుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved