జనవరి 1న సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. హైదరాబాద్ లో అన్ని ఫ్లై ఓవర్లు మూసివేత

జనవరి 1న సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. హైదరాబాద్ లో అన్ని ఫ్లై ఓవర్లు మూసివేత 2016 కొత్త ఏడాది తొలి రోజున తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సరం కానుకను తెలంగాణ ప్రభుత్వం అందించింది. జనవరి 1వ తేదీని సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంతో.. ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో అన్ని ఫ్లై ఓవర్లు ముసి వేస్తున్నారు. దానికి కారణం..

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అని చెబుతున్నారు అధికారులు. గురువారం రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు తెల్ల వారుజామున 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్‌, నెక్లెస్‌ రోడ్ లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. మద్యం సేవించి వాహనాలు పడపడం, మితిమీరిన వేగం, దురుసుగా డ్రైవింగ్ చేయడం, పరిమితికి మించి వాహనాలపై ప్రయాణించడం చేయకూడదని అధికారులు సూచిస్తున్నారు. కొత్త ఏడాది స్వాగత వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్ల లో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. కేవలం రైల్వే ట్రాక్స్ ఉన్న ఫ్లై ఓవర్లు, మరో ప్రత్యామ్నాయ మార్గాలు లేనిని మాత్రమే ఓపెన్ లో ఉంటాయని పోలీసులు తెలిపారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved