I Kindly request to all Please read this and share

*
వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే దేశభక్తా
దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్
పట్టించుకుంటున్నావా దేశభక్తా?
*
ఇష్టమైన క్రికెటరెవరో
వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు
నీకు తెలిసిన రైతు ఎవరైనా వంద బస్తాలు పండించాలని
ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా దేశభక్తా?
*
రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే
నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్నకేపేరు పెడుతావ్ దేశభక్తా?
*
దేశాన్ని గెలిపించడానికి
కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే,
టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్.
దేశాన్ని బతికించే
నదులు, చెరువులు కొన్ని మాత్రమే
నీళ్ళతో ఉన్నాయనే ఆందోళన నీకుందా దేశభక్తా ?
*
నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను
నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్
నిన్ను బతికించే అన్నదాతలనెెవరూ
ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా దేశభక్తా?
*
నీకు ఏ స్టేడియంలో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ
నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో
ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా దేశభక్తా?
*
అన్నం తింటూ కూడా ..
పాకిస్తానీ జట్టును దేశంలోకి రానియ్యాలా? వద్దా? అని
నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్ .
అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశీ బియ్యమో?
విదేశీ దిగుమతి బియ్యమో తెలుసా దేశభక్తా?
*
ఇండియన్ క్రికెట్ బోర్డో , క్రికెట్ టీమో
చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్
వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశంలో
ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని
అసలెప్పుడయినా పట్టించుకున్నావా దేశభక్తా ?
*
ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన నీకు
రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారో తెలుసా దేశభక్తా?
*
అసలు,
అసలయిన పరుగులు తియ్యడం అంటే ఏమిటో
నీకు తెలుసా దేశభక్తా?
ఎప్పుడయినా,
గిట్టు బాటు ధరల కోసమో, కరెంటు కోసమో పోరాటం చేస్తూ,
లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను చూసావా దేశభక్తా?
*
ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు
ఎవరు ఎలా రైతులను మోసం చేస్తున్నారో
తెలియకుండా ఉంటుందా దేశభక్తా?
*
పిల్లలకు స్టేడియాలకు తీసుకెళ్ళినట్లు,
చెక్కతో బ్యాట్ మాత్రమే కాదు,
వ్యవసాయ పనిముట్లు కూడా చేస్తారు అని
ఎప్పుడయినా పొలాలకు తీసుకెళ్ళి చెప్పావా దేశభక్తా ?
*
క్రికెటర్లు
బూస్టులో కూల్ డ్రింకులో తాగి
ఆరోగ్యంగా ఆడుతున్నారని
నువ్వు అన్నం తినకుండా బతకగ్గలవా దేశభక్తా?
*
కామెంట్రీలు వింటూ టీవీలకు అతుక్కుపోయినట్లు
రైతుల గురించి చర్చా కార్యక్రమాలు చూసావా దేశభక్తా?
*
ఎప్పుడు ఎలా ఆడితే
దేశం గెలుపోటముల అవకాశాలున్నాయో
చెప్పగలవ్ కదా దేశభక్తా !
మరి ఎప్పుడు ఎలా
దేశం ఆహార పంటల విషయంలో గెలుస్తుందో చెప్పలేవా?
*
పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం
కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం దేశభక్తా?
*
ఇండియాని గెలిపించే వాళ్ళను కూడా
బతికించే వాళ్ళ గురించి ఆలోచించు దేశభక్తా.
*
ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు,
పచ్చని పొలాల్లో దేశభక్తా.
అందుకు
రైతులు నాటౌట్ గా నిలవాలి
మనం చీర్ లీడర్స్ కావాలి!


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved