సన్నగా పీలగా ఉన్నానని బాధపడుతున్నారా? ఇలా చేయండి లావవుతారు!

సాధారణంగా పిల్లలు సన్నగా ఉంటే తల్లిదండ్రులు ఆందోళన చెందుతారు. వయసుకు తగ్గ బరువులేమని, బక్కగా, పీలగా ఉన్నామని కొందరు ఆందోళనలో మునిగిపోతారు. అలాంటి ఆందోళన అవసరం లేదని, 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు రోజుకు వెయ్యి కేలరీల శక్తి అవసరమవుతుందని, అలాగే 4 నుంచి 8 సంవత్సరాల మధ్యనున్న పిల్లలకు రోజుకు 1200 నుంచి 1400 కేలరీల శక్తి అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఓ పౌండ్ బరువు పెరగాలంటే అదనంగా 3,500 కేలరీల ఆహారం తీసుకోవాలని వారు సూచించారు.

రోజుకు 500 కేలరీల శక్తిగల అదనపు ఆహారం తీసుకోవడం ద్వారా వారంలో ఒక పౌండ్ బరువు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఆహారంలో కొవ్వు (ఆరోగ్యవంతమైన కొవ్వు) పదార్థాలు ఎక్కువ ఉండేలా జాగ్రత్త పడితే బరువు పెరగడం పెద్దసమస్య కాదని వారు చెబుతున్నారు. పాస్తా, చీజ్, సాస్, డ్రైఫ్రూట్స్, యోగర్ట్, ఓట్ మీల్, గోధుమలు, పళ్ల రసాలు, స్మూతీస్, పాల పదార్థాల్లో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయని, అయితే ఇవి పరిమితులకు లోబడి తీసుకోవాలని సూచించారు. అతిగా తీసుకుంటే ఊబకాయం ప్రమాదముందని, బరువు పెరగగానే వీటికి దూరంగా ఉండాలని వారు స్పష్టం చేస్తున్నారు.


Share on

బరువు పెరగాలి అనుకుంటున్నారా ..... ? ఈ రోజుల్లో బరువు పెరగటం ఒక పెద్ద సమస్యగా చెప్పవచ్చు

సన్నగా ఉండటం మరియు నాజుకుగా ఉండటం రెండు వేరు వేరు అని గుర్తు పెట్టుకోండి. సన్నగా ఉండటం వలన సున్నితంగా కనపడతాము.

మీ శరీర బరువు పెరిగి మంచి ఆకృతి పొందాలి అనుకుంటున్నారా! అయితే రోజు జిమ్ లో వ్యాయామాలను చేయండి. నిర్ణీత సమయం జిమ్ లో వ్యాయామాలను అనగా బరువు ఎత్తటం మరియు ఇతర వ్యాయామాలను అనుసరించటం వలన శరీర బరువు సులభంగా పెరుగుతుంది. మీ శరీర బరువు పెరగటం అంటే, కేవలం బరువు మాత్రమె కాకుండా, కండరాలలో ద్రవ్యరాశి పెరిగేలా చూసుకోండి. ఇలా వ్యాయామాలతో పాటూగా, తగిన ఆహరాన్ని రోజు తినటం కూడా ముఖ్యం.

ఉదాహరణకు మీరు రోజు 1500 కాలరీల ఫుడ్ తెసుకున్తునారు అనుకోండి, మీరు బరువు పెరగాలంటే రోజు తినే దానికంటే డబల్ తీసుకోవాలి అంతే 3000 కాలరీల ఫుడ్ తీసుకోవాలి

బరువు పెరగాలి అనుకున్న వారికీ ఇ 4 తప్పని సరి పాటించాలి

1. రోజుకి కనీసం 4 లేదా 5 సార్లు అధిక మోతాదులో తినండి ప్రతి 3 గంటలకి ఒకసారి తినండి.
2. 1 నెలలో బరువు పెరగాలి అనుకుంటే, బరువు ఎత్తటం వంటి వ్యాయామాల వలన కండరాలలో పెరుగుదల జరిగి శరీర బరువు పెరుగుతుంది.
3. రోజు తినే ఆహారంలో కొవ్వు పదార్థాలు కూడా ఉండాలి
4.బరువు పెరగాలి అనుకుంటే, ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లును తినాలి. గోధుమ బ్రెడ్, తాజా పండ్లు, గోధుమ బియ్యం, మల్టీ-గ్రైన్ బ్రెడ్, బంగాళదుంపలు, డ్రై ఫ్రూట్స్ మరియు తాజా పండ్లు అనగా అరటిపండ్లు మరియు మామిడి పండ్లలో మంచి కార్భోహైడ్రేట్లు ఉంటాయి.
బరువు తగ్గాలి అనుకుంటున్నారా ఇక్కడ క్లిక్ చెయ్యండి Loss Weight

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved