భారతీయ రైల్వే శాఖ సంచలన నిర్ణయం

2016-17 ఆర్థిక సంవత్సరంలో ఓ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టడానికి భారతీయ రైల్వే పావులు కదుపుతోంది. ఇప్పటి వరకూ భారతదేశంలో ట్రైన్స్ అనగానే నీలం రంగులోనో, కాస్త ఎరుపు రంగులో ఉండటాన్ని మనం చూశాం. అయితే ఇకమీద రంగురంగుల రైళ్లు ఇండియాలో కనువిందు చేయనున్నాయి. గ్రే, నేవీ బ్లూ మరియు పసుపు రంగు ట్రైన్స్ రివ్వున దూసుకుపోనున్నాయి. అంతేకాదు ఈ రైళ్లు గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో నిర్ణీత మార్గాలలో ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి.

ఈ సెమీ హై స్పీడ్ ట్రైన్స్‌తో ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని వీలైనంత మేర తగ్గించాలని భారతీయ రైల్వే శాఖ భావిస్తోంది. ఈ మార్చి నెల నుంచి ఈ తరహా ట్రైన్స్‌ను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఢిల్లీ- ఆగ్రా, ఢిల్లీ- కాన్పూర్, చెన్నై- హైదరాబాద్, నాగ్‌పూర్- సికింద్రాబాద్, ముంబై- గోవా మధ్య ఈ రైళ్లను తిప్పాలనే యోచనలో రైల్వే శాఖ ఉంది. ఢిల్లీ, ఆగ్రా మధ్య తిరిగే గౌతమి ఎక్స్‌ప్రెస్‌ 160 కిలోమీటర్ల వేగంతో ఈ ఫిబ్రవరి నుంచి పరుగులు పెట్టనుంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కత్తా, చెన్నైల మధ్య బుల్లెట్ ట్రైన్స్‌ను కూడా నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved