ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒక్క నిమిషం ఇంట‌ర్నెట్ ఆగితే…ఎం అవుతుందో తెలుసా?

ఇంట‌ర్నెట్ ఈ నాలుగు అక్ష‌రాల ప‌దం ప్ర‌పంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేసింది. ఇంట‌ర్నెట్ ద్వారా మ‌నం ఇంట్లో కూర్చుని ప్రపంచాన్ని చూసేస్తున్నాం. ఇంట్లో నుంచే షాపింగ్, వ్యాపారం, వైద్యం, ఇతర పనులన్నీ చక్కబెట్టేస్తున్నాం. అస‌లు ప్ర‌పంచంలో చాలా మందికి ఇంట‌ర్నెట్ లేక‌పోతే ఉద్యోగాలుండ‌వు…నిద్ర ప‌ట్ట‌దు… రోజు గ‌డ‌వ‌దు. అలాంటిది ఒకే ఒక్క నిమిషం ఈ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇంట‌ర్నెట్ ఆగితే ఏం జ‌రుగుతుంది. ఎన్నో కార్య‌క్ర‌మాలు నిలిచిపోతాయి. ఇంకా చెప్పాలంటే ప్ర‌పంచమే చాలా వ‌ర‌కు స్తంభించిపోతుంది.

ఒక్క నిమిషం పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ స్తంభిస్తే ఏం జరుగుతుందని ఇంటర్నెట్ వరల్డ్ స్టాట్స్ సంస్థ లెక్కగట్టింది. దాని ప్రకారం

– గూగుల్ లో 24 లక్షల అన్వేషణలు నిలిచిపోతాయి

– యూట్యూబ్ లో 28 లక్షల వీక్షణలు, 300 గంటల వీడియోల అప్ లోడింగ్ నిలిచిపోతుంది

– ఫేస్ బుక్ లో 7,01,389 లాగిన్ లు ఆగిపోతాయి

– ట్విట్టర్ లో 3,47,222 ట్వీట్లు ఆగిపోతాయి

– 2 కోట్ల పది లక్షల సందేశాలు వాట్స్ యాప్ లో బంద్ అవుతాయి

– 34,194 పోస్టులు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు కాకుండా నిలిచిపోతాయి

– 15 కోట్ల ఈ మెయిల్స్ ఆగిపోతాయి

– స్నాప్ చాట్ ద్వారా షేర్ కావాల్సిన 5,27,760 ఫోటోలు నిలిచిపోతాయి

– స్కైప్ ద్వారా చేసుకునే 1,10,040 వీడియో కాల్స్ ఆగిపోతాయి

– యాపిల్ స్టోర్స్ నుంచి 51 వేల యాప్స్ డౌన్ లోడ్ కాకుండా ఉండిపోతాయి

– అమెజాన్ నుంచి కోటీ 40 లక్షల రూపాయల కొనుగోళ్లు నిలిచిపోతాయి

– లింక్డ్ ఇన్ నుంచి 120 కొత్త ఖాతాల చేరికలు ఆగిపోతాయి


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved