కలబంద ఉపయోగాలు తెలిస్తే వదిలి పెట్టరు!!

కలబంద అంటే తెలియని వారుండరు. అడవి ప్రాంతంలో ఎక్కువగా పెరిగే మొక్కను ఇంటికి దిష్టి తగలకుండా లేదా ఇంటి ముందు తొట్టిలో పెంచుకుంటారు.అయితే కలబందకు సర్వవ్యాధులను నివారించే శక్తి కూడా ఉంది. ఈ మొక్క అందానికి, ఆరోగ్యానికి కూడా ఎంతో దోహద పడుతుంది.

కలబందలో అనేక ఔషధగుణాలున్నాయి. దీంట్లో 99.3 శాతం నీరుతో పాటు ఏ, బీ, విటమిన్లు, ఎంజైములు, మినరల్స్‌, ఆంద్రోక్వినోన్ష్‌, కార్టాసిలిక్‌యాసిడ్‌, 22 అమైనోయాసిడ్స్‌ ఉన్నాయి. ఇందులోని ఎంజైమ్స్‌ నొప్పి నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. కలబందను జ్యూస్‌ రూపంలో తీసుకుంటే శరీరంలో జరిగే వివిధ జీవక్రియల ఫలితంగా ఉత్పత్తి అయ్యేటువంటి హానికర పదార్థాల నుంచి రక్షణ కల్పిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. గుండె, హెపటైటీస్‌, కిడ్నీ సమస్యలను నివారిస్తుంది. జాండిస్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది.

లైంగిక పటుత్వాన్ని , రోగ నిరోధక శక్తి పెంచి షుగరు, మలబద్ధకాన్ని నిరోధించి అల్సర్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

వైద్య పరంగా చూస్తే కలబందలోని మెగ్నీషియం లాక్టెట్‌, వ్యాధుల నివారణకు, కీటకాలు కుట్టినపుడు కలిగే బాధకు నివారిణిగా పని చేస్తుంది. కేన్సర్‌ వ్యాధికి ఇది దివ్యౌషధం. దీన్ని వినియోగిస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిని జ్యూస్‌ రూపంలో తీసుకుంటే లైంగిక పటుత్వం పెరుగుతుంది

• చర్మ సౌందర్యం కోసం.... చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడుకోవడానికి, కాంతివంతంగా ఉంచుకోవడానికి కలబంద జెల్‌ చాలా ఉపయోగపడుతుంది. ఇది మంచి కూలింగ్‌ ఏజెంట్‌గా పని చేస్తుంది. ప్రస్తుతం కాస్మెటిక్‌ రంగంలో కలబందకు మంచి డిమాండ్‌ ఉంది. ఫేస్‌ మాయిశ్చర్‌గా, కేశాల సంరక్షణ కోసం బాగా ఉపయోగపడుతుంది. బట్టతలను నివారిస్తుంది. మొటిమలను తొలగిస్తుంది. చర్మం ముడతలు పడటాన్ని నిరోధిస్తుంది. కంటికింద నలుపును పోగొడుతుంది. ప్రెగ్నెన్సీ అనంతరం వచ్చే ముడతలను తొలగిస్తుంది. సోరియాసిస్‌, గజ్జి తదితర చర్మ సంబంధిత వ్యాధులను అరికడుతుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved