పిల్లలకు… ఎండుద్రాక్ష!!!

డ్రై ఫ్రూట్స్తో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి.

ఇందులో "కిస్ మిస్" ను పిల్లలకు ఇవ్వడం ద్వారా వారి పెరుగుదలకు ఉపకరిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో క్యాల్షియం పిల్లల్లో ఎముకల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

పిల్లలకి ఇచ్చే పాలను వేడిచేసేటప్పుడు రెండు ఎండు ద్రాక్షలను నులిపి వేసి మరిగించాలి. ఆ తర్వాత ఆ పాలను వడగట్టి పిల్లలకు ఇస్తే పుష్ఠిగా తయారవుతారు.

ఎండు ద్రాక్షల్లో సుక్రోస్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్స్, అమినో యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉంటాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్నట్లైతే ఎండుద్రాక్షలను తీసుకోవడం ద్వారా రక్తహీనతను దూరం చేసుకోవచ్చు.

తద్వారా శరీరంలో రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. పచ్చకామెర్ల వ్యాధిగ్రస్థులు రోజూ రెండు ఎండు ద్రాక్షలను తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. గుండెను పదిలం చేసే ఎండు ద్రాక్షల్లో విటమి బి, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నందును వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved