వంటింటి చిట్కాలు

» కొబ్బరిముక్కను పెరుగులో వేస్తే తొందరగా పెరుగు పాడవదు.

» పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికేటపుడు డాల్డా గాని నూనె వేయాలి. >» నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుక్కర్ కింద వేయడం వల్ల వాసనరాదు.

»పచ్చిమిరపకాయలు ముచ్చికలను తీసి ఫ్రిజ్ లో నిల్వ ఉంచడం వల్ల తొందరగా పాడవవు.

» పాలు కాచేటపుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు నూనె రాయాలి.

» అగర్బత్తిసుసితొ ఇత్తడిపాత్రలను కడగడంవల్ల బాగాశుభ్రపడతాయి.

» వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూను పాలు వేయాలి.

» పసుపు నీటితో కిచెన్ను శుభ్రంచేయడం వల్ల ఈగలు రావు.

» బిస్కెట్ పేకెట్ బియ్యండబ్బాలో ఉంచడం వల్ల తొందరగా మెత్తబడవు

» ఇంగువ నీల్వ చేసే డబ్బాలో పచ్చిమిరపకాయ వేస్తే తాజాగా ఉంటుంది.

» నూనె పొరపాటున ఒలికితే ఆ ప్రాంతంలో కొంచెం మైదాపిండి జల్లితే నూనెను త్వరగా పీల్చేస్తుంది.

» క్యాబేజి ఉడికించేటపుడు వాసనరాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయ్యాలి.

» కత్తిపీటకు ఉప్పురాయడం వల్ల పదునుగా తయారవుతుంది.

» బట్టలపై నిమ్మరసంగానీ,టూత్ పేస్ట్ గానీ వేసిరుద్దడం వల్ల ఇంకు మరకలు పోతాయి.

» ఎండుకొబ్బరిచిప్ప కందిపప్పుడబ్బాలో వేసి నిల్వ ఉంచితే పప్పు పాడవదు.

» కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పురాసి,నీళ్ళు చల్లి గంట సేపు ఉంచితే చేదు పోతుంది.

» వెల్లుల్లిపాయను మెత్తగా దంచి కొంచెం నీటితో కలిపి బొద్దింకలు వచ్చేచోట ఉంచితే అవి ఆ ప్రాంతానికి రావు.

» మినపప్పు త్వరగా నానాలంటే ఆ నీళ్లలో ఇనుపవస్తువు ఏదైనా వెయ్యాలి.

» బ్రెడ్ పేకెట్ లో బంగాళదుంప ముక్కలు ఉంచితే త్వరగా పాడవదు.

» నూనె పొంగకుండా ఉండాలంటే నూనెలో కొంచెం చింతపండు వెయ్యాలి.

» చేతులకు నూనెరాసి పనసకాయ తరిగితే జిగురు అంటకుండా ఉంటుంది.

» వడియాల పిండిలో కొంచెం నిమ్మరసం వేస్తే తెల్లగా వస్తాయి.

» గుడ్లు ఉడకబెట్టేటపుడు కొంచెం ఉప్పు వేసి ఉడకనిస్తే పెంకులు త్వరగా ఊడిపోతాయి.

» పకోడిలు వేసేటపుడు పిండిలో కొంచెం సోడా కలిపితే లావుగా అవుతాయి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved