కివీ ఫ్రూట్ కిక్కే వేరప్పా

కివి ఫ్రూట్స్‌ గురించి వినే ఉంటారు.. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. ముఖ్యంగా ఈ సీజన్‌లో వీటిని బాగా తినాలి. ఈ ఫ్రూట్స్‌లో పోషకవిలువలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు శరీర ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కాపాడుతుంది. కివి ఫ్రూట్స్‌ని తింటే శరీరంలోని నీరసం ఇట్టే పోతుంది. ఎంతో ఎనర్జిటిక్‌గా తయారవుతాం. కివిని తినడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటాం. ఈ ఫ్రూట్‌ రుచి అంటారా..? ఎంతో మధురంగా ఉంటుంది. ఈ ఫ్రూట్స్‌లో కమలాఫలాల్లో ఉన్నంతగా సి విటమిన్‌ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండు అన్ని వయసుల వారికీ ఎంతో మంచిది. దీన్ని స్నాక్‌గా కూడా తినొచ్చు. ఈ సీజన్‌లో వచ్చే రకరకాల జబ్బులు దరిచేరకుండా ఇది కాపాడుతుంది. ఇందులో అధిక మోతాదులో పీచు పదార్థాలుండటం వల్ల జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. ఈ పండు స్వీటుగా ఉన్నప్పుటికీ ఇందులో కాలరీలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఈ సీజన్‌లో కివి పండ్లు బాగా తినండి.. ఎనర్జిటిక్‌గా ఉండండి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved