మీకు ఒక్కతే కూతురా! అయితే ఆ స్కూల్స్ లో మీ పాపను ఫ్రీగా చదివించవచ్చట!

మన భారతదేశంలో కేంద్రీయ విద్యాలయాలకు మంచి పేరు ఉంది. ఆ స్కూల్స్ లో అత్యుత్తమ విద్య లభిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు 1100 మాత్రమే ఉన్నాయి. కేంద్ర ఉద్యోగుల పిల్లలకు మాత్రమే అందులో అడ్మిషన్లు దొరుకుతాయన్న అపోహ చాలామందికి ఉంటుంది. అటువంటి అపోహలన్ని దూరంచేస్తూ పాఠశాల సీట్ల కేటాయింపు ఏవిధంగా ఉంటుందో వివరించారు కేంద్రీయ విద్యాలయాల కమీషనర్. అయితే అటువంటి కేటాయింపులకు ఏమాత్రం సంబంధం లేకుండా , ఆడపిల్లల విద్యను పోత్రహించేందుకు తాజా నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. ఒక్కతే ఆడపిల్ల సంతానంగా ఉంటే… అటువంటి బాలికలకు ఉచిత విద్యను అందించనున్నామని తెలిపారు. ఒక్కతే ఆడపిల్ల ఉన్నవారు వారికి దగ్గరలో ఉన్న K.V ల్లో జాయిన్ చేయవచ్చని తెలిపారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved