శ్రావణ మాసంలో లక్ష్మీ పూజ ఎలా చెయ్యాలో ఎందుకు చెయ్యాలో తెలుసా?

అందరికి లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటాము. నిత్యం లక్ష్మి దేవిని పూజిస్తూనే ఉంటాము, కాని ఆషాడమాసం తరవాత వచ్చే శ్రావణ మాసంలో లక్ష్మి పూజ చేస్తే చాల మంచిదని మన పూర్వీకులు అంటారు. ఈ మాసంలో శుక్ర, మంగళ వారాలు ముఖ్యమైనవి. ఈ నెలలో వచ్చే నాలుగు శుక్రవారాలు కూడా లక్ష్మీ పూజ చేస్తారు. ఈ పూజని ఎలా చేస్తారంటే…

 1. శుక్రవారం నాడు పొద్దుటే లేచి, స్నానం చేసి, ఇల్లంతా సుబ్రపరచుకుని, వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలి.
 2. తరవాత లక్ష్మిదేవికి ఇష్టమైన సనగలు నానా బెట్టి వాటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. సనగలు అంటే లక్ష్మీ దేవికి చాలా ఇష్టం. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
 3. పాలతో చేసిన ఏ వంటకమైన లక్ష్మీ దేవికి ఇష్టమే. అందుకే పాలతో పాయసం, పరవన్నం ఏదైనా పెట్టచ్చు.
 4. పూజ గదిలో లక్ష్మీ దేవిని పూలతో చక్కగా అలంకరించి, నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి.
 5. ఎవరినైనా ముతైదువును పిలిచి మన శక్తి కొద్ది తాంబూలం ఇవ్వాలి.
 6. అయితే నాలుగు వారాలు ఇలా చేసినా, రెండవ వారం వరలక్ష్మివ్రతం చేస్తారు. వీలుకాకపోతే ఏ వరమైనా చెయ్యవచ్చు.
 7. వరలక్ష్మి వ్రతం రోజు అంతా అలనే చేసి, అమ్మవారికి మూడు లేక ఐదు లేక తొమ్మిది రకాల మన శక్తిని బట్టి పిండివంటలు వండి నైవేద్యం పెట్టాలి.
 8. ఇక అమ్మవారికి చీర,లక్ష్మీ రూపు, అలంకరణ అన్నీ మన శక్తి మరియు భక్తి మీదా ఆదారపడి ఉంటుంది.
 9. ఆ రోజు వరలక్ష్మి వ్రత కథను చదువుకుని, తోరణం చేతికి కట్టుకోవాలి.ఇలా పూజ చేసుకుని, ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వాలి.
 10. ఇది పెళ్లి కానివారికి, పెళ్లి అయిన ముత్తైదువులకు కూడా చాల మంచిడది.

ఎందుకు…

1.శ్రావణ మాసంలో లక్ష్మీ దేవిని పూజించడం వలన ఆమె చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది.

2.పెళ్లి అయిన వారు ఈ పూజ చేసుకోవడం వలన సౌభాగ్య వతులుగా వర్ధిల్లుతారు.

3.లక్ష్మీ అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటారు. ధనము, ధైర్యము,విద్య, ధాన్యము,విజయము, పరపతి, సంతానము,గుణము ఇవన్నీ కూడా మనకి ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తాము.

4.ఈ మాసంలో పెళ్ళిళ్ళు కూడా ఎక్కువగా అవుతాయి. కొత్త పెళ్ళికూతురితో అత్తగారు ఈ వ్రతం చేయిస్తుంది. అంటే ఆమెకు పూజలు, వాటి విధానం మరియు వాటి ప్రాముఖ్యత తెలుస్తుంది.

5.ఈ మాసంలో ఈ పూజ చేయడం వలన సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగు తాయని ప్రతీతి.

6.ఈ వ్రత కథలో చారుమతికి అనే స్త్రీ అందరితో అనుకవగా ఉంటుందని, అత్తమామలను చక్కగా చూసుకుంటుందని అలాంటి స్త్రీ కి లక్ష్మీ దేవి కటాక్షం కలిగిందని చెబుతారు.

 1. అంటే ఆడవాళ్ళు ఎప్పుడూ వినయంగా ఉంటూ, అత్తమామలను అందరిని ఆదరించాలని, అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందని, కొత్త కోడలికి తెలుస్తుంది.

8.ఏ ఇంట్లో ఆడవాళ్ళు సౌమ్యంగా ఉంటూ, ఇంటిని ఇంటిల్లపాదిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో అన్ని మరియు అందరి పనులు విజయవంతం అవుతాయి.

 1. అలాగే లక్ష్మీ స్వరూపమైన స్త్రీ ని, ఏ ఇంట్లో కంట తడి పెట్టనీయక చక్కగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు.

మన పూర్వీకులు మనకి ఇచ్చిన ప్రతీ పూజలో, సాంప్రదాయాలలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు మరియు మనుషుల జీవన శైలికి కావాల్సిన మంచి సూత్రాలు ఉంటాయి. వాటిని అర్ధం చేసుకుని ఆచరిస్తే ఆనదంగా ఉండచ్చు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved