మధుమేహానికి కాఫీ చెక్

కాఫీ తాగే అలవాటు మధుమేహం, స్థూలకాయం వంటి దీర్ఘకాలిక రుగ్మతలపై ఎలాంటి ప్రభావం చూపదని యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌హాగన్‌ పరిశోధకులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులుండి, కాఫీ తాగే అలవాటున్న 93వేల మంది డీఎన్‌ఏపై అధ్యయనాన్ని చేశారు. ప్రధానంగా కాఫీ తాగాలనే కోరిక కలిగించే జన్యువులను నిశితంగా పరీక్షించారు. మిగతావారి కంటే కాఫీ ఎక్కువగా తాగే వారిలో ఆ కోరికను కలిగించే జన్యువులు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ జన్యువులు మధుమేహం, స్థూలకాయాన్ని కలిగించవని తేలింది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved