మధుమేహానికి తిరుగులేని వైద్యం

మధుమేహం.... జీవితాంతపు సమస్య అని ఎవరు చెప్పారు? మధుమేహాన్ని శాశ్వతంగానే నిర్మూలించే ఆయుర్వేద వైద్య చికి త్సలు ఇప్పుడు మీ ముందున్నాయి. అందుకే మధుమేహం వచ్చిందన్న దిగులుతో ఎవరూ కుంగిపోవలసిన అవసరం లేదు. అందువల్ల వ్యాధిని ఏ రోజుకారోజు నియంత్రిస్తూ, జీవితాంతం మందులు వేసుకొమ్మని చెప్పే వైద్య విధానాల తెరవు వెళ్లకుండా ఆయుర్వేదాన్ని ఆశ్రయించండి... వ్యాధి రహిత జీవితాన్ని ఆస్వాదించండి అంటున్నారు, ఆయుర్వేద వైద్య నిపుణులు...

భారత దేశంలో ఈ రోజు ప్రతి వంద మందిలో 14 మంది మధుమేహం బారిన పడుతున్నారనేది వాస్తవం. అయితే వ్యాధి మొదలైన చాలా ఏళ్లదాకా కొందరు తమకు ఆ వ్యాధి ఉన్నదనే విషయాన్నే గుర్తించలేకపోతున్నారు. దానికి కారణం మధుమేహ వ్యాధి లక్షణాల గురించిన ఒక స్పష్టమైన అవగాహన లేకపోవడమే.

ఏమిటా లక్షణాలు:

విపరీతంగా దాహం వేయడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి రావడం, అతిగా ఆకలి వేయడం, ఎంత ఆహారం తీసుకున్నా, నీరసంగానూ, నిస్సత్తువగానూ ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయినా నిర్లక్ష్యం చేస్తే, విపరీతమైన అలసట, కాళ్లు లాగడం, చూపు మందగించడం, శరీరానికి ఏవైనా దెబ్బ తగిలినప్పుడు ఆ గాయం త్వరగా తగ్గకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరియైున వైద్య చికిత్సలేవీ లేక, ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే, ప్రధాన రక్తనాళాలు దెబ్బతిని గుండె, మెదడు సంబంధిత సమస్యలు తలెత్తడం, కాళ్లూ చేతుల్లోని రక్తనాళాలు దెబ్బ తినడంతో పాదాల్లో అరచేతుత్లో తిమ్మిర్లు, మంటలు రావడం ఉంటాయి. చిన్న రక్తనాళాలు దెబ్బ తినడం వల్ల కంటిలోని రెటీనా కూడా దెబ్బ తింటుంది. ఒక దశలో లైంగిక సామర్థ్యాన్ని దెబ్బ తినడం పాటు, కొన్ని రకాల మానసిక రుగ్మత లకు కూడా దారి తీస్తుంది.

మధుమేహ నియంత్రణ కోసం నేడు చాలా మంది తీసుకుంటున్న ఆధునిక వైద్య చికిత్సల్లో ఏం జరుగుతోంది? వారు సూచించే మాత్రల్లోని రసాయనాల వల్ల తలనొప్పి, జీర్ణసంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. కొందరి చర్మం మీద మచ్చలు కూడా ఏర్పడతాయి. ఒక దశలో శరీరం మొత్తంగా కొన్ని అవాంఛిత ప్రక్రియలు మొదలవుతాయి.

ఆయుర్వేద విశిష్టత

ఆయుర్వేదం ఎంత ప్రాచీనమైనదో అంత శాశ్వతమైనది. ప్రకృతిలోని అమూల్యమైన కొన్ని వనమూలికల ద్వారా సిద్ధం చేసిన ఔషధాల ద్వారా అది మధుమేహాన్ని సమూలంగా, శాశ్వతంగా పెరికి వేస్తున్నది. దీని వెనుక దశాబ్దాల అనుభవం ఉంది. ఆయుర్వేద వైద్య చికిత్సలు తీసుకున్న లక్షలాది మంది మధుమేహ రోగులు ఆ వ్యాధి సమస్యల నుంచి విముక్తులయ్యారు. అందరికీ ఒకే తరహా మందు అని కాకుండా, రోగి ఎన్నేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నాడు? ఈ వ్యాధి అతనికి అనువంశిక మూలాలతో వచ్చిందా? జీవన శైలి లోపాలతో వచ్చిందా? లేక మానసిక ఒత్తిళ్ల వచ్చిందా? అన్న వివరాలనీ సేకరించి తదనుగుణంగా వారికి ఔషధాలు సూచిస్తారు.

ఆయుర్వేద ఔషధాలు ఇవ్వడం మొదలెట్టాక క్రమక్రమంగా పాశ్చాత్య రసాయనిక మందులు తగ్గిస్తారు. అత్యాధునికమైన ఈ ఆయుర్వేద ఫార్ములా మందుల వల్ల మీకు సరికొత్త జీవితం లభించడం ఖాయం. మీరు మధుమేహాన్ని ఒక వ్యాధిగా భావించకండి. నిజానికి మధుమేహం కేవలం మీరు మీ జీవనశైలిలో అనుసరించ వలసిన మార్పులను సూచించే ఒక హెచ్చరిక మాత్రమే. ఆయుర్వేద వైద్యం ద్వారా మధుమేహాన్ని నయం చేయడమే కాదు అప్పుడప్పుడే మొదలవుతున్న ప్రీడయాబెటీస్‌ వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. అయితే, మందులతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటించడం కూడా ముఖ్యమవుతుంది. ముఖ్యంగా పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, ఉప్పు, చక్కెర సంబంధిత పదార్థాలను బాగా తగ్గించడం, పౌష్టిక ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా నిత్యం వ్యాయామం చేయడం అవసరం. ఐదు వేల సంవత్సరాల ఆయుర్వేద వైద్య శాస్త్రం ఇప్పుడు ఆధునికతతో మీ ముందు ఉంది.

మధుమేహాన్ని శాశ్వతంగా నయం చేసేందుకు కంకణబద్దమై ఉంది.

- See more at: http://www.snehahastamsociety.org/useful- articles.php

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved