మిరియాలు రుచికి ఘాటుగా..కారంగా ఉంటాయి. ఆయుర్వేద ఔషధాలలో మిరియాలను విరివిగా ఉపయోగిస్తారు.

మిరియాలు కఫాన్ని కరిగించడంలో తోడ్పడతాయి. మిరియాలు కలిసిన ఆహారపదార్దాలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అజీర్ణ సమస్యలతో బాధపడేవారు మెత్తగా దంచిన మిరియాలపొడిని పాతబెల్లంతో కలిపి ఉండలా చేసుకుని భోజనానికి ముందు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమౌతుంది. చిగుళ్లవాపుతో బాధపడేవారు కూడా చిటికెడు రాళ్ల ఉప్పు, మిరియాలపొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి, గోరువెచ్చని నీటితో పుక్కిలిస్తే..ఉపశమనం లభిస్తుంది.

చిన్నచిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా మిరియాల పొడి వేసిన చారు ఆహారంలో తీసుకుంటే ఎంతో మంచిదని వైద్యలు చెబుతున్నారు.

జలుబు, దగ్గుతో బాధపడుతూ..గొంతు బొంగురుపోయినపుడు కూడా గోరువెచ్చని పాలలో మిరియాల పొడి ..చిటికెడు పసుపు, ఒక చెంచాడు తేనె కలిపి తాగితే ఉపశమనం కలుగుతుంది. మిరియాలలో క్యాల్షియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, అమినో యాసిడ్ లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ లాగ పనిచేస్తాయి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved