అమ్మతో అనుబంధం

ఆడాళ్లూ...మీకు జోహార్లు ...ఓపిక...ఒద్దిక ఉన్నోళ్లు...మీరు ఒకరికంటే ఒకరు గొప్పోళ్లు...అని ఓ సినిమా గీతంలో కవి ఆడవారి గొప్పతనాన్ని గురించి ఆకాశమంత ఎత్తులో పొగిడేస్తాడు...అయితే నేటి మహిళ పురుషులతో సమానంగా నేడు అన్ని రంగాలలో దూసుకుపోతున్నదని సగర్వంగా చెప్పుకునే రోజులు వచ్చేసినా...ఆడవారికి అంటూ...కొన్ని హద్దులు కూడా ఉంటాయి.

ఆధునిక భావాలు కలిగిన...స్వేచ్ఛాయుత జీవితాన్ని కోరుకోవడంలో తప్పేమీ లేదు. అందుకు అభ్యంతరాలు కూడా ఏమీ లేవు. కాకపోతే శృతిమించిన స్వేచ్ఛ బరితెగింపుకు కారకమవకూడదు.

ఓ దీప్తి కథ...

అమితకు 30 సంవత్సరాలు. ఆమెకు టీనేజ్‌ కూతురు దీప్తి...వయసు 16 సంవత్సరాలు...అంటే అమితకు వాళ్ల తల్లిదండ్రులు చిన్నతనానే పెళ్లిచేసేసి చేతులు దులిపేసు కున్నారు. మూడు పదుల వయసుదాటని అమిత తన తీరని కోర్కెలన్నీ కూతురుమీద ప్రయోగించి తృప్తిచెందుతుంటుంది. దురదృష్టవశాత్తూ నాలుగేళ్ల క్రితం భర్త యాక్సిడెంట్‌లో చనిపోయాడు. ఏడు తరాలకు సరిపడ ఆస్తి ఉంది. అమితకు ఇప్పుడు సమాజంపై తీరని కసి పెరిగింది. తన జీవితాన్ని మోడువారేలా చేసిన తన తల్లిదండ్రులపై మరింత కసి...అందుకే ఇప్పుడు ఏ బంధువులనూ, మిత్రులనూ తన ఇంటికి చేరనివ్వడంలేదు...తన గారాలపట్టి దీప్తే ఇప్పుడు ఆమెకు సర్వం...స్కూల్‌కు వెళ్లినా...వెళ్లకపోయినా... చదివినా...చదవకపోయినా...దీప్తి ఇష్టానికి కాదనేదికాదు. దీప్తి అడగడం ఆలస్యం అర్థరాత్రయినా సరే ఆ వస్తువును తెచ్చి తెల్లారేక ఆమె నిద్రలేవగానే ఆమె మంచంమీద ఉండాల్సిందే...తను చదవకపోయినా...కూతురు చదవాలని...ఆమె కష్టపడకూడదని అనుకునేది అమిత. ఊళ్లోకల్లా పెద్ద పేరున్న కాలేజీలో ఎక్కువ డొనేషన్‌ కట్టి కాలేజీలో చేర్పించింది. ఇక కాలేజీకి వెళ్లే దీప్తి...సినిమా యాక్టర్లు, వ్యాంపులు కూడా వేయనట్టి అసభ్యకరమైన మిడ్డీలతో కుర్రాళ్లను రెచ్చగొట్టేది. దీప్తి ఏ డ్రస్సు కావాలంటే ఆడ్రస్సు కొనేది అమిత...కాలేజీకి కొత్తల్లో సరదాగా వెళ్లే దీప్తి రాను రాను ఆమె ప్రవర్తనలో విపరీతమైన మార్పులు గమ నించింది అమిత...ఈ మధ్య ఎందుకో డల్‌గా ఉంటోంది. చీటికీ మాటికీ చిరాకు...గదిలో ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ప్రయత్నిస్తోంది. తనతో కూడా మనసువిప్పి మాట్లాడటంలేదు.. ఒకరోజు అమిత బయటకువెళ్లి ఇంటికి రాగానే దీప్తి అచేతనంగా పడివుంది. పక్కనే ఒక ఉత్తరం రాసి ఉంది. అమితకు కాళ్లు చేతులు ఆడలేదు. ఫోన్‌చేసి డాక్టర్‌ను పిలిపించింది. అప్పటికే సమయం మించిపోయింది. దీప్తి కానరాని లోకాలకు వెళ్లిపోయింది.

అసలేం జరిగిందంటే...

ఆమె రాసిన ఉత్తరంలో ఏం రాసిందో తెలుసా....అమ్మా నువ్వు నన్ను ఎందుకు సరిగ్గా పెంచలేదు...అని సూటిగా అడుగుతున్నాను. నువ్వు నాకు ఏ తల్లీ ఈ లోకంలో తన కూతురికి పంచలేని ప్రేమాభిమానాలను పంచావు. నీవు ఇచ్చిన స్వేచ్ఛతో నేను కాలేజీలో చెడువ్యసనాలకు బానిసనయ్యాను. బాయ్‌ ఫ్రెండ్స్‌తో సినిమాలకు, షికార్లకు వెళ్లేదాన్ని...అలా క్రమంగా వారితో పరిచయాలు ఏర్పడ్డాక... మత్తుమందులకు కూడా బానిసను అయ్యాను. ఆ మత్తులో నాకు ఏం తప్పు జరుగు తోందో కూడా గ్రహించ లేనంతగా...జరిగింది తప్పని...నన్ను మొదట్లోనే కనీసం వారించేవాళ్లు ఎవరూ లేకపోవడంతో... నేను పూర్తిగా బానిసనయ్యాను. ఇంతలోనే నాకు ఎవరు అంటించారో తెలియదుగానీ...భయంకరమైన ఎయిడ్స్‌ వ్యాధి కూడా వచ్చింది. వైద్యుడు స్పష్టంగా ధ్రువీకరించాడు కూడా...ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని చెప్పి నాలోనేను కుమిలిపోయాను. నీకు తెలిస్తే నీ గుండె ఎక్కడ బద్ధలవు తుందో అని తల్లడిల్లి పోయాను... అందుకే ఆ ప్రాణాంతకాన్ని రోజూ మోస్తూ జీవించేకన్నా... ఒక్కసారిగా ఈ ప్రపంచం నుండే నీకు దూరం అయితే బాగుండు నని పించింది. నా గురించి ఎక్కువగా బెంగపెట్టుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నీ తదనంతరం మన ఆస్తి మొత్తాన్ని ఏ అనాధ శరణాల యానికో ఇచ్చేయ్‌.. .మళ్లీ జన్మంటూ ఉంటే... నీకు మాత్రం కూతురుగా పుట్టను. నీవు...నన్ను చిన్నప్పుడే క్రమ శిక్షణతో పెంచివుంటే...తాతయ్య, నానమ్మల ప్రేమను రుచి చూపించి వుంటే నాకు ఎవరో ఒకరు పెద్దల నీతిమాటలు నా పట్ల పనిచేసి వుండేవి. నేను తప్పు చేస్తున్నప్పుడు వారి మాటలు నన్ను అడుగడుగునా హెచ్చరించివుండేవి. కానీ నువ్వు అటువంటి ప్రేమ, ఆప్యాయతలకు నన్ను ఏనాడో దూరం చేశావు. నా దృష్టిలో నీవు పరిపూర్ణమైన అమ్మవి కావు... నువ్వు చేసిన పనికి నీకు... ఇంతకన్నా ప్రపంచంలో ఏ శిక్షా ఉండదు అనుకుంటున్నాను. తనివితీరా అనుభవిస్తావు కదూ...ఇట్లు నీ ముద్దుల దీప్తి...

నేటి వాస్తవం...

నిజానికి ఇది ఒక దీప్తి కథేకాదు...నేటి ప్రపంచంలో జరుగుతున్న వాస్తవం...చదువుల పేరిట, ఆధునికత వూటున ఆడవారిని ఆడవాళ్లుగా ఇప్పటి స్త్రీలు పెంచుతున్నామని ఒక్కసారి గుండె మీద చెయ్యివేసుకుని చెప్పమనండి....ఎంతసేపూ మా అమ్మాయికి అస్సలు వంటచేయడం రాదు...కనీసం ఉప్మా వండటం రాదు...ఇల్లు ఊడ్వడం కూడా రాదని గొప్పలు చెప్పే తల్లులే కనిపిస్తున్నారు. ఆడవారు ఎంత చదువుకున్నా... విదేశాలకు వెళ్లినా...పెద్ద కొలువులు చేసినా పెళ్లయ్యాక సంసారాలు చేయవలసిందే కదా...కనీస సంప్రదాయాలు తెలుసుకోకనే నేటి ఆధునిక జంటలు పెళ్లి కాగానే అంతే తొందరగా విడాకులు కూడా కోరుకుంటున్నాయి. కొందరు పెద్దలు ఇది తప్పు అని కూడా చెప్పకుండా...విడాకుల కోసం లాయర్ని సంప్రదించా ల్సిందిగా ఉచిత సలహాలు కూడా ఇస్తుంటారు.

పరిపూర్ణ స్ర్తీ...

నేటి సమాజానికి కావలసినది స్వేచ్ఛ సమానత్వంతో బాటు...పరిపూర్ణ స్ర్తీగా నిర్వర్తించవలసిన బాధ్యత...దేశానికి రాజైనా అమ్మకు కొడుకే...అన్నట్లుండాలి ప్రతి తల్లీ...తమ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండే చూడాలనుకునే మొదటి వ్యక్తి తల్లే...


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved