పిల్ల‌ల‌ను త‌గుల‌బెట్టి .. త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌

హైదరాబాద్ లోని గచ్చిబౌలికి చెందిన ఆ తల్లి మాన‌సిక వేద‌న‌తో శనివారం తెల్లవారుజామున దారుణ‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఆ నిర్ణ‌యం కార‌ణంగా మూడు ప్రాణాలు పోయాయి. గ‌చ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర నివాసముంటున్న ఆ తల్లి తన ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ సంఘటన చూసిన‌వారు కంట‌నీరు పెట్టారు. ఈ దుర్ఘ‌టనలో తల్లి వినోద(43), పిల్లలు జ్యోతి(12), సాయి విఘ్నేష్ రెడ్డి(6)లు అక్కడిక్కడే మృతిచెందారు. భర్త నరేందర్ రెడ్డి వేరే మహిళతో కలిసి ఉండటం, భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ లో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved