మౌనవ్రతం ఎందుకు పాటిస్తారంటే?

వాక్కును నిరోధించడమే మౌనవ్రతం. చాలామంది వారంలో ఏదో ఒక రోజు మౌనదీక్ష పాటిస్తారు. మౌనదీక్ష వల్ల ఉపయోగం ఏంటి? అంటే.. ఆరోగ్యపరంగా, ఆధ్మాత్మికంగా మౌనవ్రతం ఎంతో మేలు చేస్తుంది. వాక్ శుద్ధి, వాక్ శక్తి పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చూస్తే కూడా మంచి ఫలితాల్ని ఇస్తుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి, కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి మౌనవ్రతం ఉపయోగపడుతుంది. పరుష వచనాలు పలకడం, అబద్ధాలు ఆడటం, ఇతరులపై చాడీలు చెప్పుట, అసందర్భ ప్రలాపాలు లాంటి అనేక దోషాలు మౌనవ్రతంతో తొలగిపోతాయి. చాలా అనారోగ్య సమస్యలకు కారణం మనలో ఉండే ఆవేశం, కోపం. వాటిని నియంత్రించుకుంటే ఆరోగ్యం బావుంటుంది. సమస్యలు తేలిగ్గా పరిష్కారమవుతాయి. దీనిమూలంగా సామాజికంగా ఉపయోగం వున్నట్లేకదా.

మౌనం అంటే నోరు పెగల్చకుండా పరమనిష్ఠతో మౌనంగా ఉండాలి. పెద్దలు భక్తినీ, ఆరోగ్యాన్ని కలిపి ఆచారంగా ఇలా పెట్టారు. మనం మనకి తోచినప్పుడు విశ్రాంతి తీసుకున్నట్టుగానే శరీరంలో పనిచేసే అవయావాలకి ఆచారాలూ, సాంప్రదాయం పేరుతో విశ్రాంతినివ్వాలని పెద్దలు చెప్పారు. రమణ మహర్షి, వివేకానందులవారు, రామకృష్ణ పరమహంస వంటి మహాజ్ఞానులు సైతం మౌనానికి ప్రాధాన్యత ఇచ్చేవారట.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved