మంచి నీళ్లు తింటున్నారా?

ఎండ వేడిమి పెరుగుతోంది, దీనితో ఆ వేడికి చెమట రూపంలో మనం కోల్పోయే నీరు శాతం అధికంగా ఉంటుంది. వేడిని తట్టుకొని చల్లగా వుండాలంటే నీరు అధిక శాతం ఉన్న పండ్లను, కూరగాయలను క్రమం తప్పకుండా రోజూ తీసుకుంటే చాలా మంచిది. నీరు ఎక్కువగా వుండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

అధిక నీరు ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల అతి తక్కువ కాలరీలు లభించడంతో పాటు కడుపు కూడా నిండినట్టు ఉంటుంది. దీనితో వేరే తిను బండారాల మీదకి మనసు వెళ్లదు. నీటితో పాటు ఇతర పోషకాలను కూడా శరీరానికి అందిస్తాయి. అధిక శారీరక శ్రమ తరువాత సాధారణ మంచి నీటి కంటే పండ్లు, కూరగాయలను తీసుకోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు.

ఖర్బూజా, స్ట్రాబెర్రి వంటి పండ్లలో 92% నీరు, అలాగే పైనాపిల్, ఆరెంజ్ వంటి పండ్లలో 87% నీరు వుంటుంది. కీరాలో 96% నీరు వుంటుంది, రాడిష్, జుకీని లలో 95%, టమాట లో 94%, క్యాబేజిలో 93%, కాలీఫ్లవర్, వంకాయ, పాలకూర లలో 92% నీరు వుంటుందట. ఒక గ్లాసు మంచి నీరు తాగడం కన్నా పండ్లో, కూరగాయలో తినడం మంచిదని డాక్టర్లు చెపుతున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved