విండోస్ 10లో కొత్త ఫీచర్స్ ఏమున్నాయి?

గత వారం విండోస్‌ 10 విడుదల అయిన తర్వాత- ఈ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే 1.5 కోట్ల మంది వినియోగదారులు దీనిని ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. ప్రస్తుతం విండోస్‌ 7, విండోస్‌ 8.1ను ఉపయోగిస్తున్న వారందరూ ఈ ఆపరేటింగ్‌ వ్యవస్థను ఉచితంగా అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు ఉచితంగా వాడుకోవచ్చు. దీని కారణంగా వచ్చే మూడేళ్లలో దాదాపు వంద కోట్ల డివైజ్‌లలో దీనిని ఇన్‌స్టాల్‌ చేసుకుంటారని ఒక అంచనా. అలాంటి విండోస్‌ 10ను ఎలా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలో చూద్దాం..

1. డెస్క్‌టాప్‌, ట్యాబ్‌లెట్‌, సెల్‌ఫోన్‌లకు.. విండోస్‌ డివైజ్‌లను వాడే యూజర్‌కు ఏక సౌలభ్యం ఉండాలన్నది మైక్రోసాఫ్ట్‌ ఉద్దేశం. అందుకనే మీరు డెస్క్‌టాప్‌, ట్యాబ్‌లెట్‌ లేదా విండోస్‌ ఫోన్‌ వాడినా ఎక్కడా తేడా అనిపించదు. ట్యాబ్‌ను టచ్‌స్ర్కీన్‌గానే వాడతాం. అవసరమైనప్పుడు కీబోర్డును అటాచ్‌ చేసుకుని కూడా ఆపరేట్‌ చేయాల్సి వస్తుంది. అప్పుడు కీబోర్డు ద్వారా కాని లేదా టచ్‌స్ర్కీన్‌ ద్వారా కాని - అంటే ఏదో ఒక పద్ధతితో మాత్రమే ఆపరేట్‌ చేయడానికి వీలుండేది. ఇప్పుడు కొత్త విండోస్‌ 10లో అయితే ఏకకాలంలో కీబోర్డు, టచ్‌స్ర్కీన్‌ రెండింటితోను పనిచేసుకునే సౌలభ్యం వచ్చింది. స్టార్ట్‌ మెనూను కూడా ఫింగర్‌ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దారు.

2. విండోస్‌ స్టోర్‌లోని యూనివర్శల్‌ యాప్స్‌ను ఒక్కసారి డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే డివైజ్‌లన్నింటిలో ఇంటిగ్రేడ్‌ అవుతాయి. ఇదివరకు విండోస్‌ కేవలం డెస్క్‌టా్‌పలకు మాత్రమే ఓఎ్‌సగా ఉండేది. తరువాత ట్యాబ్స్‌కు ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ మొబైల్‌కు ఓఎస్‌ అయిన సంగతి తెలిసిందే. ఇలా మూడింటిలోనూ ఏ డివైజ్‌కు తగ్గట్టు ఆ డిస్‌ప్లేను విండోస్‌ 10 ఇవ్వగలదు.

3. విండోస్‌ 8లో టచ్‌ స్ర్కీన్‌లో కూడా ఉపయోగించగలిగిన కొన్ని ఫుల్‌స్ర్కీన్‌ అప్లికేషన్స్‌ను మైక్రోసాఫ్ట్‌ ప్రవేశపెట్టింది. విండోస్‌ 10లో దీనిని ఐచ్ఛికంగా మార్చారు. విండోస్‌ 10ను- డెస్క్‌ టాప్‌లు, ట్యాబ్‌లెట్‌లు, స్మార్ట్‌ఫోన్లలో కూడా ఎటువంటి మార్పు లేకుండా ఉపయోగించుకొనేలా రూపొందించారు కాబట్టి ఈ ఫీచర్‌ చాలా ఉపకరిస్తుంది.

4. విండో్‌స8లో ఫుల్‌స్ర్కీన్‌ స్టార్ట్‌ మెనూను ప్రవేశపెట్టారు. అయితే చాలా మంది ఈ స్టార్ట్‌ మెనూను ఇష్టపడలేదు. దీనితో విండో్‌స10లో పాతతరం విండో్‌సలోని స్టార్ట్‌ అప్‌ మెనూను మళ్లీ ప్రవేశపెట్టారు. కావాలనుకున్నవారు ఫుల్‌ స్ర్కీన్‌ మెనూను కూడా ఉపయోగించుకోవచ్చు.

5. విండోస్‌ 10లో స్నాప్‌ అనే అప్లికేషన్‌ను మరింత పరిపుష్టం చేశారు. దీనివల్ల అప్లికేషన్లను మనకు నచ్చిన పద్ధతిలో డెస్క్‌టా్‌పపై పెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్‌ వల్ల నాలుగైదు వర్చువల్‌ డెస్క్‌టా్‌పలను ఏర్పాటు చేసుకోవచ్చు. దీనివల్ల మనకు నచ్చిన బ్లాగ్‌లను, వెబ్‌సైట్లను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవచ్చు.

6. విండోస్‌ 10లో కార్టానా అనే కొత్త అప్లికేషన్‌ను ప్రవేశపెట్టారు. ఇది గొంతును గుర్తిస్తుంది. మనమిచ్చే ఆజ్ఞలను శిరసావహిస్తుంది. అంతే కాకుండా మన అవసరాలను ముందే గుర్తిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం ఒక వాణిజ్య సంస్థకు మెయిల్‌ పంపాలనుకున్నాం. అప్పుడు కార్టానా మెయిల్‌ ఐడీని అందించటమే కాకుండా- సైడ్‌ బార్‌లో ఇంటర్నెట్‌లో ఆ వాణిజ్య సంస్థకు సంబంధించిన వివరాలన్నీ సేకరిస్తుంది. దీనిని ఒక క్లిక్‌ ద్వారా ఎక్కడికైనా పంచుకోవచ్చు.

7. ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌తో పాటుగా- విండోస్‌ 10లో మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ అనే కొత్త బ్రౌజర్‌ వచ్చి చేరింది. దీనిలో అత్యాధునిక బ్రౌజర్లలో ఉన్న మొత్తం అన్ని లక్షణాలు ఉన్నాయి.

8. విండోస్‌ 10 అప్‌గ్రేడ్‌ చేసుకునే ముందు.. మీ సిస్టమ్‌లో ఇదివరకే విండోస్‌ 7 లేదా విండోస్‌ 8.1 ఉంటే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా విండోస్‌ 10ను అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. అయితే మీ కంప్యూటర్‌ కాన్ఫిగరేషన్‌ను మాత్రం ఒకసారి సరిచూసుకోవాలి. విండోస్‌ 10కు మినిమమ్‌ రిక్వైర్‌మెంట్‌ 1జిహెచ్‌జెడ్‌ ప్రాసెసర్‌, కనీసం 1 జీబీ రామ్‌, 16 జీబీ హార్డ్‌డిస్క్‌ స్పేస్‌ ఉండాలి. లేకపోతే అప్‌గ్రేడ్‌ చేయడం కుదరదు. వీటిని పరిగణలోకి తీసుకోకుండా చేస్తే డేటా కరప్ట్‌ అయ్యే ప్రమాదం ఉంది.

క్లీన్‌ ఇన్‌స్టాల్‌...

అందుబాటులో ఉన్న ఆపరేటింగ్‌ వ్యవస్థను తొలగించి.. కొత్తదాన్ని ప్రవేశపెట్టడాన్ని క్లీన్‌ ఇన్‌స్టాల్‌ అంటారు. క్లీన్‌ ఇన్‌స్టాల్‌ వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. విండోస్‌ రిజిసీ్ట్ర కొత్తగా ఉండటమే కాకుండా.. ఆపరేటింగ్‌ వ్యవస్థకు అప్పటికే ఇన్‌స్టాల్‌ అయ్యున్న అప్లికేషన్లపై పూర్తి నియంత్రణ లభిస్తుంది. అంతే కాకుండా ఇన్‌స్టాల్‌ చేసుకొనే సమయంలో తప్పులు కూడా జరగవు. అయితే ప్రస్తుతం విండోస్‌ 7 లేదా 8.1ను వాడుతున్నవారే క్లీన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోగలుగుతారు. అంతే కాకుండా అప్పటి దాకా కంప్యూటర్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌లను తొలగించి మళ్లీ రీ ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఎక్కువ సమయం పడుతుంది. దీనికి సంబంధించిన మొత్తం అన్ని వివరాలు మైక్రోసాఫ్ట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved