కొన్ని నెలల క్రితం ఎత్తు పెరగడానికి సర్జరీ చేఇంచుకున్న నిఖిల్ రెడ్డి నడిచాడు

అస్సలు ఎం జరిగింది అంటే (కొన్ని నెలల క్రితం):

నగరంలోని గ్లోబల్ ఆసుపత్రి వైద్యుల నిర్వాకం తీవ్ర విమర్శలకు దారితీసింది. లక్డికాపూల్ గ్లోబల్ ఆసుపత్రిలో నిఖిల్ రెడ్డి అనే యువకుడికి ఎత్తు పెంచుతామంటూ లక్షల్లో డబ్బులు వసూలు చేసి ఆపరేషన్ నిర్వహించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో బెడ్‌పై తన కుమారుడి దయనీయ స్థితిని చూసి ఆ తండ్రి ఎంతో ఆవేదనకు గురయ్యాడు.

ఆసుపత్రిలో రెండు కాళ్లు కట్ చేసి ఉండటంతో అపస్మారక స్థితిలో ఉన్న కుమారుడి చూసిన నిఖిల్ తండ్రి గోవర్ధన్ రెడ్డి ఆసుపత్రి వైద్యులపై ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడికి ఆపరేషన్ చేస్తే తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధ్యత లేదా? అంటూ నిలదీశారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఏవిధంగా ఆపరేషన్ చేస్తారని ప్రశ్నించారు.

అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు బెంగుళూరులో ఉన్నాడని తాము ఇప్పటి వరకు అనుకుంటున్నామని చెప్పారు. మూడు రోజులుగా తన కుమారుడి నుంచి ఎటువంటి ఫోన్ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని తమ కుమారుడి ఫోన్ ఆధారంగా ట్రాక్ చేస్తే గ్లోబల్ ఆసుపత్రిలో ఉన్నాడని తెలిసిందని చెప్పుకొచ్చారు. ఈరోజు ఉదయం ఆసుపత్రికి వచ్చి తమ కుమారుడికి ఏమైందని అడిగితే ఆసుపత్రి యాజమాన్యం స్పందించడం లేదని అన్నారు. చివరకు ఆసుపత్రిలోని వాచ్‌మెన్ జరిగిన విషయాన్ని చెప్పడంతో వైద్యులను నిలదీశామన్నారు. తమ కుమారుడు తెలిసో తెలియక ఎత్తు పెంచుకునేందుకు వస్తే డాక్టర్లు కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పోయి తమకు తెలియకుండా ఆపరేషన్ చేశారని అన్నారు. దీంతో మీ కుమారుడి రెండు కాళ్లు కత్తిరించామని, కాళ్లలో రాడ్లు వేసి అతని ఎత్తు పెంచుతామని చెప్పారని అన్నారు. సుమారు 7 గంటల పాటు ఈ సర్జరీ చేశామని వైద్యులు తెలిపారని అన్నారు.

ఈ ఆపరేషన్ కోసం రూ. 4 లక్షలు వసూలు చేశారని నిఖిల్ తండ్రి చెప్పారు. మమ్మల్ని ఎంతో క్షోభకు గురిచేసిన ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏడు గంటలుగా ఐసీయూలో తమ కుమారుడికి ఏమి చేస్తున్నారో తమకు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నిఖిల్ తండ్రి గోవర్థన్ రెడ్డి డిమాండ్ చేశారు. తమ కుమారుడు ఎత్తు తక్కువగా ఉన్నాడా? అంటే అలాంటిదేమీ లేదని 5.7 ఎత్తు ఉన్నాడని బాధితుడి తండ్రి పేర్కొన్నాడు. ఎప్పుడూ తాను ఎత్తు తక్కువ ఉన్నాననే భావన కూడా తమ ముందు వెలిబుచ్చలేదని తెలిపాడు. అయితే ఇప్పుడు సడన్‌గా ఇలా ఆపరేషన్ చేయడం ద్వారా తమ కుమారుడు సంవత్సరం పాటు వీల్‌చైర్‌కే పరిమితవ్వడం బాధగా ఉందని తెలిపాడు. నిఖిల్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తమకు బెంగగా ఉందని, తమ కుమారుడిని తక్షణమే చూపించాలని బాధితుడి తల్లిదండ్రులు ఆస్పత్రి ముందు ఆందోళన నిర్వహించారు.

అయితే నిఖిల్ రెడ్డికి ఆపరేషన్ చేయడాన్ని ఆసుపత్రి సిబ్బంది మాత్రం సమర్ధించుకుంటున్నారు. నిఖిల్ మేజర్ కాబట్టి ఆపరేషన్ చేశామని వైద్యులు చెబుతున్నారు. మైనారిటీ తీరిన వ్యక్తి ఎవరు వచ్చినా, అతని వెనుక ఎవరు లేకున్నా అతను కోరితే ఆపరేషన్ చేస్తామని వారు సమాధానం చెప్పారు. ఇది జరిగింది

ఇప్పుడిప్పుడే నికిల్ కొంచెం కొంచెం నడుస్తున్నాడు నిఖిల్ పూర్తిగా నడవాలని మన్సుపురితిగా కోరుకుందా!!


Share on

ఎత్తు పెంచుకునే ఆపరేషన్ చేయించుకొని తప్పు చేశాను అంటున్న నిఖిల్ రెడ్డి

కేవలం మూడు ఇంచ్ ల పొడవు కోసం ఆత్మన్యూనతని జయించటానికి తాను తీసుకున్న నిర్ణయం తన జీవితాన్ని ఏ మలుపుతెస్తుందో తెలియని నిఖిల్..ఒకప్పుడు సాఫ్ట్ వేర్ రంగం లో తనకంటూ ఒక గుర్తింపు ఉన్న రోజులని తలచుకుంటున్నాడు.

అయితే నిఖిల్ తండ్రి మాత్రం ఇంకా గ్లోబల్ ఆసుపత్రి వర్గాల మీద కోపంగానే ఉన్నారు. డబ్బుకోసం నిఖిల్ భవిశ్యత్తు తో ఆడుకున్నారనీ… ఇప్పుడు ఈ ఇంఫెక్షన్ లు చూస్తూంటే భయంగా ఉందనీ ఆయన అన్నారు..‘ఉగాది రోజునే మా వాడిని డిశ్చార్జి చేస్తామన్నారు. కానీ నిన్నటి నుంచి కాళ్లపై బొబ్బలు వచ్చాయి. విపరీతమైన మంటలు, నొప్పులు వస్తున్నాయి. కదల్లేకపోతున్నాడు. నా కుమారుడి విషయంలో పూర్తి అనైతికంగా వ్యవహరించిన వైద్యులు, ఆస్పత్రిపై కేసు పెట్టాం. త్వరలో ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌కూ ఫిర్యాదు చేస్తాం.” అంటూ చెప్పారు…

అమ్మానాన్నలకు చెబితే వద్దంటారనే వారికి చెప్పకుండా మిత్రులతో కలసి ఆస్పత్రిలో చేరాడు. నేను మేజర్ అవ్వడంతో అమ్మానాన్నలు ఎక్కడని ఆస్పత్రివారు అడగలేదు. తన ఆపరేషన్ కోసం డబ్బు సమకూర్చుకోవటానికి కూడా నిఖిల్ చాలా కష్టపడ్డాడు తాను పనిచేసే కంప్యూటర్ సంస్థలో వచ్చే జీతం మొత్తాన్ని ఇంట్లోనే ఇచ్చేసే నిఖిల్. శస్త్రచికిత్సకు అవసరమయ్యే డబ్బు కోసం రాత్రిళ్లు పనిచేసి వివిధ రకాల కంప్యూటర్ అప్లికేషన్లు రూపొందించాడట. ఆ డబ్బుతోనే ఈ ఆపరేషన్ కోసం ఫీజు చెల్లించాడు. ఏప్రిల్ 5న ఆరు గంటల పాటు శస్త్రచికిత్స చేశారు. ఇప్పటికే పది రోజులవుతోంది. కాళ్లలో మంటలు, బొబ్బలు వస్తున్నాయి. వారం రోజుల్లో నార్మల్ అయిపోతుందని డాక్టర్లు చెప్పారు కానీ ఇంకా కనీసం మంచం మీద లేచికూర్చోవటం కూదా సాధ్యం కావటం లేదు. ఆత్మ విశ్వాసం కోసం ఎత్తు కావాలనుకున్నాడు కానీ ఇప్పుడు అతని పరిస్థితి మరీ ఇబ్బందిగా మారింది… “మా అన్నయ్య ఇప్పటికే సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టారు. నేనూ సొంతంగా కంపెనీ పెట్టి హుందాగా ఎదగాలన్నదే లక్ష్యం. కాలేజీ రోజుల్లోనే నేను రూపొందించిన వివిధ అప్లికేషన్లకు మంచి డిమాండ్ వచ్చింది. కానీ ఇప్పుడు చూడాలి. దేవుడు ఏం చేస్తాడో!” అంటూ నిరాశలో కూరుకు పోతున్నాడు.

చుడండి నిఖిల్ ఎంత బాధపడుతున్నడో

Discussion On Height Lengthening Surgery Controversy By Global Hospital

Height operation ఇలా చేస్తారు


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved