షిఫ్టులతో కష్టాలు

రోజూ నిద్ర సరిగా పట్టడంలేదా? పడుకున్న ఎన్నో గంటలకుగానీ నిద్రరావడం లేదా? ఇలాంటి వారంతా భవిష్యత్తులో క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉందిట. నిద్ర పోయే వేళలు సరిగా పాటించకపోవడం వల్ల పలువురు వ్యక్తులు ముఖ్యంగా మహిళలు క్యాన్సర్‌ బారిన పడతారని శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో బయటపడింది. ముఖ్యంగా షిఫ్టు వర్కులుండే ఆఫీసు పని వల్ల వారికి సరిపడినంత నిద్ర లేక ఆరోగ్యం దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని మొదట ఎలుకల మీద చేశారు. అందులో నిద్ర లేమి వల్ల క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది. కుటుంబంలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ నేపథ్యం ఉన్న మహిళలు షిఫ్ట్‌ వర్కుకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీనిపై మరిన్ని అధ ్యయనాలు జరగాల్సిన ఆవశ్యకతను కూడా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. షిఫ్ట్‌ ఉద్యోగాల కారణంగా శరీర అంతర్గత వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. షిఫ్ట్‌ వర్కు చేసే వ్యక్తుల బట్టి కూడా అంటే వారి సామాజిక తరగతి, వారు చేస్తున్న పని, వారిలో విటమిన్‌డి పాళ్లు ఎంత ఉన్నాయన్న అంశాల బట్టి కూడా వారి శారీరక ఆరోగ్య స్థితి ఉంటుందని అధ్యయనకారులు పేర్కొన్నారు. పగటిపూట పనివేళలకు, రాత్రిపూట పనివేళలకు, రొమ్ము క్యాన్సర్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతున్న తొలి అధ్యయనంగా శాస్త్రవేత్తలు దీన్ని పేర్కొన్నారు. ఊబకాయం ఉన్న మహిళలలో అయితే ఈ రిస్కు మరింత ఎక్కువ ఉండడాన్ని కూడా ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. ముఖ్యంగా రొటేషన్‌ షిఫ్ట్‌ వర్కు చేస్తున్న ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగి అది క్యాన్సర్‌కు దారితీస్తోందని అధ్యయనకారులు అంటున్నారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved