లీటర్ పెట్రోల్‌ తో 360 కిలో మీటర్లు మైలేజ్.. భారత విద్యార్ధి అద్బుత సృష్టి

ప్రముఖ టూ వీలర్ సంస్థలు వాళ్ళ కంపెనీ టూ వీలర్ బండి 100 కిలో మీటర్లు మైలేజ్ ఇస్తుందని గొప్పలు పోయినా చివరకు రోడ్ మీదకు వచ్చేసరికి మహా అయితే 60 నుండి 70 కుడా దాటదు. కాని భారత విద్యార్ధి అద్బుత సృష్టి సాధించాడు. కర్నాటకకు చెందిన ఒక మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి కేవలం లీటర్ పెట్రోల్‌ తో 360 కిలో మీటర్లు మైలేజ్ ఇవ్వగల టూ వీలర్‌ ని సృష్టించాడు. ఆ వివరాలలోకి వెళితే.. అతని పేరు సూరజ్ రాయకర్. ఇతను భాగల్ కోట‍‌‌లోని బసవేశ్వర ఇంజనీరింగ్ కాలేజి‌లో మెకానికల్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.

ఈ హైబ్రిడ్ స్కూటర్ రూపొందించడానికి కారణం తనకు ఆటోమొబైల్స్ అంటే విరపరీతమైన ఇష్టం ఉందని అందుకే దీనిని తయార చేశాడని చెప్పాడు. ఒక పాత టూ వీలర్‌ ను ఉపయోగించి అందులో ఎనిమిది బ్యాటరీలను అమర్చి వీటిని ఛార్జ్ చేయడానికి రెండు బ్యాటరీ ఛార్జర్‌లు, మరియు ఒక లీటర్ పెట్రోల్ దీని తయారు చేయడానికి ఉపయోగపడ్డాయి. ఒక లీటర్ పెట్రోల్‌ ను పూర్తిగా ఇందులో గల బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి ఉపయోగిస్తాడు. అనగా ఇంజన్ నుండి వచ్చే పవర్‌ ను ఛార్జర్‌ ల ద్వారా బ్యాటరీలకు అందుతుండగా.. ఈ బ్యాటరీల ద్వారా స్కూటర్ నడుస్తుంది.

ఒక లీటర్ పెట్రోల్ ద్వారా ఛార్జ్ అయిన బ్యాటరీలు స్కూటర్ దాదాపుగా 360 కిలో మీటర్లు నడవడానికి సహాయపడుతుంది. అయితే ఈ మొత్తం ప్రయోగానికి ఇతనికి గైడెన్స్ ఇచ్చింది డాక్టర్ కుప్పాస్ ఇతని ఫ్రొఫెసర్ అని తెలిపాడు. ఈ ప్రయోగానికి చెందిన వివరాలను ప్రధాన మంత్రికి ఇతను వ్రాతపూర్వకంగా ఉత్తరం వ్రాయగా. ప్రధాన మంత్రి కార్యాలయం నుండి అనుకూలంగా ఉత్తరం వచ్చింది. ఇలాంటి ప్రయోగాలకు సంభందించి పూర్తి సహకారం అందిస్తామని ఆ ఉత్తరం లో ఉందని తెలిపాడు.

see more - http://www.snehahastamsociety.org/useful-articles.php

Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved