జోర్ సే బోలో... ప్యార్ సే బోలో జై ..విరాట్ .!జై ..జై ..విరాట్ ..! భారత్ మాతా కి జై

టి20 వల్డ్‌కప్ పోటీల్లో భాగంగా మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో గెలిచి భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంది. విరాట్ కోహ్లీ మరోసారి విరాట్ స్వరూపం చూపించి గెలిపించాడు. 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ 13, రోహిత్ శర్మ 12 పరుగులు చేసి అవుటయ్యారు, రైనా 10 పరుగులు, యువరాజ్ 21 పరుగులు చేసి అవుటయ్యారు. ధోనీ 18 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 78 పరుగులు చేసి భారత్‌ను గెలిపించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 160 పరుగలు చేసింది. ఖవాజా 26, ఫించ్ 43, వార్నర్ 6, స్మిత్ 2, మ్యాక్స్‌వెల్ 31, ఫాల్క్‌నర్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో పాండ్యా 2 వికెట్లు తీశాడు. నెహ్రా, బుమ్రా, అశ్విన్, యువరాజ్‌ తలా ఒక వికెట్ తీశారు.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved