ఉల్లిపాయ‌ల‌ను చ‌క్రాల్లా క‌ట్ చేసి కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ వేసుకుని నిద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

ఉల్లిపాయ‌లు… వీటిని మనం నిత్యం వంట‌ల్లో ఉప‌యోగిస్తుంటాం. ఘాటైన వాస‌న క‌లిగి ఉండే ఉల్లిపాయ‌ల‌ను కోసిన‌ప్పుడు మ‌న క‌ళ్ల‌కు నీళ్లు కూడా వ‌స్తాయి. కానీ మీకు తెలుసా..? అలా ఉల్లిపాయ మ‌న క‌ళ్ల‌కు నీళ్లు తెప్పించినా దాంతో మ‌న‌కు ఎన్నో లాభాలే ఉన్నాయి. అంటే, క‌ళ్ల‌కు నీళ్లు తెప్పించ‌డం ద్వారా కాదు. దాన్ని నిత్యం వివిధ ర‌కాలుగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అదేం మేం చెప్ప‌బోయేది. అయితే ఉల్లిపాయ‌ల‌ను చ‌క్రాల్లా కోసి కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ ధ‌రించి నిద్రిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం రండి.

1. పెద్ద‌గా ఉండే ఉల్లిపాయ‌ల‌ను చ‌క్రాల్లా కోసి రాత్రి పూట కాళ్ల కింద పెట్టుకుని సాక్స్ ధ‌రించి నిద్రించాలి. ఉద‌యాన్నే తీసేయాలి. దీంతో మ‌న‌కు ప‌లు ఆరోగ్య‌కర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప్ర‌ధానంగా ఇలా చేయ‌డం వ‌ల్ల కాళ్లు మృదువుగా మారుతాయి. కాళ్ల‌కు ఉండే ప‌గుళ్లు పోతాయి.

2. ర‌క్తం శుద్ధి అవుతుంది. జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో ఉండే నీరంతా బ‌య‌టికి పోతుంది.

3. ఉల్లిపాయ‌ల‌ను కాళ్ల కింద పెట్టుకోవ‌డ‌మే కాదు, ఆ చ‌క్రాల‌ను వాస‌న చూసిన‌ట్ట‌యితే త‌ల‌నొప్పి ఇట్టే మాయ‌మ‌వుతుంది.

4. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడే గుణాలు ఉల్లిపాయ‌ల‌లో ఉన్నాయి.

5. చ‌ర్మంపై ఉల్లిపాయ చ‌క్రాల‌ను రాస్తుంటే మ‌చ్చ‌లు తొల‌గిపోతాయి. చ‌ర్మం మృదువుగా మారుతుంది.

6. ఉల్లిపాయ ర‌సాన్ని త‌ల‌కు రాస్తుంటే ఊడిపోయిన వెంట్రుక‌లు కూడా మ‌ళ్లీ పెరుగుతాయి. జుట్టు ఒత్తుగా మారుతుంది. శిరోజాలు కాంతివంతమ‌వుతాయి.

7. ఉల్లిపాయ‌ల‌ను ప‌చ్చిగా తింటుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది.

8. ఉల్లిపాయ‌ల‌ను కట్ చేసి వాటి వాస‌న పీలుస్తుంటే జ‌లుబు కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది.

9. బెణుకులు, కండ‌రాల నొప్పుల‌ను ఉల్లిపాయ‌లు త‌గ్గిస్తాయి. ఉల్లిపాయ‌ల‌ను తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. వాటికి చక్కెర‌ను క‌ల‌పాలి. అనంత‌రం ఆ మిశ్ర‌మాన్ని స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాసి బ్యాండేజ్‌తో క‌వ‌ర్ చేయాలి. దీంతో నొప్పి త‌గ్గుతుంది.

10. ఉల్లిపాయ‌ల‌ను మెత్త‌ని పేస్ట్‌లా చేసి నుదుటిపై రాస్తుంటే మైగ్రేన్ త‌ల‌నొప్పి త‌గ్గుతుంది


Share on

పచ్చి ఉల్లిపాయ తినండి.. కొలెస్ట్రాల్ తగ్గించండి!

కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే.. ఊబకాయంతోపాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. ఇంకా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశముంది. ఇలా కాకుండా కొలెస్ట్రాల్ ను క్రమంగా తగ్గించుకుంటే.. నిత్యం ఆరోగ్యంగా మెలగవచ్చు. కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. వ్యాయామం చేయడం, ఇతర కష్టతర పనులు చేయాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయ తీసుకుంటే చాలు.. కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఉల్లిపాయలో క్రోమియం ఎక్కువ మోతాదులో నిల్వ వుంటుంది. అది వల్ల షుగర్ లెవల్స్‌ను క్రమబద్ధం చేస్తుంది. అలాగే టైప్2 డయాబెటిస్‌ను ఉల్లిపాయ నివారిస్తుంది. పచ్చి ఉల్లిపాయ నిత్యం తీసుకుంటే.. అధిక కొలెస్ట్రాల్‌ను అతి తక్కువ సమయంలోనే తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయ గొప్ప యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ బయోటిక్, యాంటీ మైక్రో బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగివుంది. ఇందులో విటమిన్ సి, బి1, బి6, విటమిన్ కె, బయోటిన్, క్రోమియం, క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, డైటరీ ఫైబర్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని పోషక విలువలు కలిగిన ఉల్లిపాయను ప్రతిరోజూ డైటింగ్ లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఉల్లిపాయ సాధారణ జలుబు, దగ్గు, శ్వాసనాళపు వాపు, ప్ల్యూమోనియ, అధిక జ్వరం, ఆస్తమా వంటి జబ్బుల్ని నివారిస్తుంది. ఇంకా పొట్ట సమస్యలు, వికారం, డయేరియాను నివారించడానికి దోహదపడుతుంది. ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్ పవర్ క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. ఈ ఉల్లిపాయ కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. బ్యూటీపరంగానూ ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసంను అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. అలాగే.. చర్మసమస్యల్ని నివారించుకోవడానికి ఈ ఉల్లిపాయతో ఎన్నో రెమెడీస్ చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు.


Share on

చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నివారించే ఒకే ఒక్క ఉల్లిపాయ

ఉల్లిచేసే మేలు తల్లి కూడా చేయదని ఊరికే అనలేదు. ఎందుకంటే ఉల్లిపాయాలో శరీరానికి అంతర్గతంగా మరియు బహిర్గతంగా అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను అంధిస్తుంది. వీటిని కేవలం ఉడికించి లేదా పచ్చివి తినడం వల్ల ఈ ప్రయోజనాలను పొందడం మాత్రమే కాదు, వ్యాధి సంక్రమించిన ప్రదేశంలో అప్లై చేస్తే చాలు.

అనేక హెల్త్ ప్రాబ్లెమ్స్ ను నేచురల్ గా క్యూర్ చేసే వండర్ ఫుల్ హెల్త్ బెనిఫిట్స్ ఈ ఉల్లిపాయలో ఉన్నాయి . ఒక్క ఉల్లిపాయను ఉపయోగించి అనేక వ్యాధులను నివారించుకోవచ్చు . ఉల్లిపాయతో వాంతులు, దగ్గు, జలుబు, చాతీలో నొప్పి, రొమ్ము పడిశము, చెవి నొప్పి మరియు పొట్టనొప్పి వంటినెంటినో గ్రేట్ గా నివారించుకోవచ్చు. అవును ఒక్క ఉల్లిపాయతోనే ఈ జబ్బులన్నీంటే తగ్గించుకోవచ్చు.

జుట్టురాలడాన్ని తగ్గించి పెరుగుదలకు సహాయపడే ఉల్లి

శరీరం మీద బహిర్గతంగా అయిన గాయాలను మరియు ఇన్పెక్షన్స్ ను మరియు వీటి ద్వారా రక్త స్రావాన్ని నివారించడంలో ఉల్లిపాయ గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది బాడీ ఇన్ఫెక్షన్స్ ను నివారించి, వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.

ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ యాంటీ బయోటిక్ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఉల్లిపాయలో క్యూర్సిటిన్ వంటి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. వివిధ రకాల వ్యాధులకు కారణమయ్యే శరీరంలోని టాక్సిన్స్ ను శరీరం నుండి ఉల్లిపాయ తొలగిస్తుంది .

ఉల్లిపాయ రసం శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. చాతీలో చేరిన అన్ని శ్లేష్మం (కఫం) బహిష్కరించడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు జాయింట్ పెయిన్, డయాబెటిస్, హార్ట్ సమస్యలను సమర్థవంతంగా నివారిస్తుంది. మరి ఉల్లిపాయ వివిధ రకాల వ్యాధులను ఏవిధంగా తగ్గిస్తుందో చూద్దాం...

దగ్గు:

ఉల్లిపాయను రెండు గా కట్ చేయాలి. ఉల్లిపాయ లోపలి బాగంలో ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ అప్లై చేయాలి. ఇలా ప్రతి ఒక్క లేయర్ అప్లై చేసిన తర్వాత, ఇప్పుడు ఈ రెండు భాగాలను క్లోజ్ చేసి, ఒక జార్లో పెట్టాలి. ఒక గంట తర్వాత బయటకు తీసి రోజుకు రెండు సార్లు తీసుకుంటే దగ్గును నివారిస్తుంది.

ఫీవర్:

జ్వరంగా ఉన్నప్పుడు ఉల్లిపాయ హైబాడీ టెంపరేచర్ ను తగ్గిస్తుంది. ఉల్లిపాయను రెండుభాగాలుగా కట్ చేసి, సగం ఒక కాలి పాదం క్రింద, మరో సగం మరో కాలి పాదం క్రింద ఉంచాలి. తర్వాత సాక్సులు ధరించి రాత్రంతా అలాగే పడుకోవాలి. ఇలా చేయడం వల్ల జ్వరం త్వరగా తగ్గుతుంది. ఉల్లిపాయలు శరీరంలోని టాక్సిన్స్ మరియు జబ్బులను నివారిస్తుంది.

వాంతులు:

ఉల్లిపాయలను గ్రైండ్ చేసి అందు నుండి రసాన్ని తియ్యాలి. ఇప్పుడు స్ట్రాంగ్ గా పుదీనా టీ తయారుచేసి, 2చెంచాలా ఉల్లిపాయ రసాన్ని త్రాగాలి, 5నిముషాల తర్వాత 2 చెంచాల చల్లటి పుదీనా టీ త్రాగాలి మరియు 5 నిముషాల తర్వాత దీన్ని రిపీట్ చేయాలి. ఇలా చేస్తుంటే వాంతులు త్వరగా తగ్గుతాయి.

తెగిన గాయాల నుండి రక్తస్రావాన్ని తగ్గిస్తుంది:

ఉల్లిపాయను కట్ చేసి ఉల్లిపాయ ఔటర్ స్కిన్ ను తెగిన గాయం చుట్టూ చుట్టాలి. ఇది రక్తస్రావాన్ని వెంటనే తగ్గిస్తుంది . మరియు గాయం చుట్టూ క్రిములు చేరకుండా నాశనం చేస్తుంది.

జలుబు దగ్గు, కఫం తగ్గిస్తుంది:

ఉల్లిపాయను పేస్ట్ చేసి అందులో కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేయాలి . ఈ పేస్ట్ ను చాతీ మీద అప్లై చేయాలి. తర్వాత టవల్ ను కప్పాలి. లేదా రాత్రుల్లో ఇలా చేసి టీషర్ట్ ధరించి పడుకోవడం వల్ల జలుబు, దగ్గు, కఫం తగ్గుతుంది.

చెవి నొప్పి మరియు ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది:

చెవి నొప్పిని మరియు ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ సహాయపడుతుంది. ఉల్లిపాయ పేస్ట్ ను నొప్పిగా ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి . ఆప్రదేశంలో క్లాత్ తో చుట్టేయాలి .

బేబీస్ లో పొట్టనొప్పిని తగ్గిస్తుంది:

పిల్లల్లో పొట్టనొప్పిని నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. అందుకు చేయాల్సిందల్లా, ఉల్లిపాయను కొద్దిగా నీటిలో వేసి ఉడికించాలి . ఆనియన్ వాటర్ కూల్ గా అయిన తర్వాత , ఈ వాటర్ ను ఒక చెంచా పిల్లలకు త్రాగిస్తే తక్షణ రిలీఫ్ పొందుతారు . గంటకొక్కోసారి ఇస్తుంటే నొప్పి నివారించబడుతుంది.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved