డెంగ్యూ జ్వ‌రానికి చెక్ పెట్టే సింపుల్ చికిత్స, బొప్పాయి ఆకులు.!

డెంగ్యూ వ్యాధి వ‌చ్చిన వారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో అంద‌రికీ తెలుసు. తీవ్ర‌మైన జ్వ‌రం, త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చ‌ర్మంపై ద‌ద్దుర్లు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. అస‌లు స‌రిగ్గా నిలుచోలేరు. కూర్చోలేరు. బెడ్‌కే ప‌రిమితం కావ‌ల్సి వ‌స్తుంది. గంట‌లు గ‌డుస్తున్న కొద్దీ ఆరోగ్యం మ‌రింత క్షీణించి ప్రాణాల‌కు ప్ర‌మాదం క‌లిగే అవకాశం ఉంటుంది. అయితే ఇవే కాదు, డెంగ్యూ వచ్చిన వారి ర‌క్తంలో ఉండే ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా బాగా త‌గ్గుతుంది. దీంతో ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది. సాధార‌ణ వ్య‌క్తుల్లో ప్లేట్‌లెట్లు 1.50 ల‌క్ష‌ల నుంచి 4.50 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంటే డెంగ్యూ వ‌చ్చిన వారిలో 1.50 ల‌క్షల క‌న్నా త‌క్కువ‌గా ఉంటుంది. గంట‌లు అయిన కొద్దీ ఇవి వేల సంఖ్య‌లో ప‌డిపోతూనే ఉంటాయి. ఈ క్ర‌మంలో ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచ‌డం కోసం వైద్యులు ప‌లు ర‌కాల మందుల‌ను, విట‌మిన్ స‌ప్లిమెంట్ల‌ను రోగుల‌కు అందిస్తారు. రోగి కొద్దిగా కోలుకున్న త‌రువాత డిశ్చార్జి చేస్తారు. కానీ కొన్ని రోజుల వ‌ర‌కు వారు మందుల‌ను స‌క్ర‌మంగా తీసుకోవాల్సిందే. స‌రైన ఆహారం తినాల్సిందే. లేదంటే రోగం మ‌ళ్లీ తిర‌గ‌బెట్టేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే అలాంటి వారు కింద సూచించిన విధంగా ఓ చిట్కాను పాటిస్తే ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను త్వ‌ర‌గా పెంచుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. తద్వారా డెంగ్యూ వ్యాధి కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది. ఇంత‌కీ ఆ చిట్కా ఏమిటంటే, బొప్పాయి పండు ఆకులు… అవును, అవే..!

బొప్పాయి పండు ఆకుల‌తో త‌యారు చేసిన ఓ మిశ్ర‌మాన్ని సేవించ‌డం వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను బాగా పెంచుకోవ‌చ్చు. ఆ మిశ్ర‌మాన్ని ఎలా త‌యారు చేయాలంటే, కొన్ని బొప్పాయి ఆకుల‌ను తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. వాటిని మిక్సీలో వేసి దాంతోపాటు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీరు, ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం, చిటికెడు ప‌సుపుల‌ను కూడా వేయాలి. అనంత‌రం అన్ని ప‌దార్థాల‌ను బాగా మిక్సీ ప‌ట్టాలి. అప్పుడు వ‌చ్చే ద్ర‌వాన్ని వ‌డ‌బోసి, దానికి కొంత తేనె క‌లిపి నిత్యం రెండు పూట‌లా తీసుకోవాలి. డాక్ట‌ర్ ఇచ్చిన మెడిసిన్స్‌తో పాటు ఈ మిశ్ర‌మాన్ని కూడా తీసుకోవాలి. అప్పుడే గుణం క‌నిపిస్తుంది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పెర‌గ‌డ‌మే కాదు, త్వ‌ర‌గా వ్యాధి నుంచి కోలుకుంటారు.

కింద ఇచ్చిన వీడియోను చూడ‌డం ద్వారా బొప్పాయి ఆకుల మిశ్ర‌మాన్ని ఎలా త‌యారు చేయ‌వ‌చ్చో తెలుస్తుంది…

డెంగీ వ‌చ్చి ర‌క్తంలో ప్లేట్‌లెట్స్ బాగా త‌గ్గాయా..? అయితే ఈ ఫుడ్స్ తినండి... దీంతో ప్లేట్‌లెట్స్ వేగంగా పెరుగుతాయి...

ప్లేట్‌లెట్స్‌.... వీటి గురించి దాదాపుగా అంద‌రికీ తెలుసు. డెంగీ జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు ప్లేట్‌లెట్లు ఎక్కువ‌గా క్షీణిస్తాయి. అంటే ర‌క్తంలో ఉన్న వాటి సంఖ్య ఒకేసారి త‌గ్గుతుంది. సాధార‌ణ ఆరోగ్యవంత‌మైన వ్య‌క్తితో పోలిస్తే డెంగీ వ‌చ్చిన వారి ర‌క్తంలో ఉండే ప్లేట్‌లెట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌డిపోతూనే ఉంటాయి. ఈ క్ర‌మంలో ఆరోగ్యం బాగా విష‌మించి ఒక్కోసారి ప్రాణాల‌కే ప్ర‌మాదం క‌లుగుతుంది. కానీ అలాంటి రిస్క్ తీసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా వైద్యులు ఇచ్చే మందుల‌తోపాటుగా కింద పేర్కొన్న ప‌లు ఆహార ప‌దార్థాల‌ను తీసుకుంటే ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను బాగా పెంచుకోవ‌చ్చు. దీంతో వ్యాధి నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

1. బొప్పాయి పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల డెంగీ వ‌చ్చిన వారు త్వ‌ర‌గా కోలుకుంటారు. ప్లేట్‌లెట్ల సంఖ్య కూడా పెరుగుతుంది.

2. దానిమ్మ పండ్ల‌ను తిన్నా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఇది ర‌క్తం ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

3. ఆకుప‌చ్చ‌గా ఉండే ఆకుకూర‌లు, కూర‌గాయ‌ల‌ను ఎక్కువ‌గా తినాలి. దీంతో వాటిలో ఉండే విట‌మిన్ కె ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుతుంది.

4. వెల్లుల్లి రేకుల్ని ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలా మంచిది. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్య వృద్ధి చెందుతుంది.

5. ర‌క్త‌హీన‌త‌తో బాధ‌పడేవారే కాదు, డెంగీ వ‌చ్చిన వారు కూడా బీట్ రూట్ జ్యూస్‌ను తాగ‌వ‌చ్చు. దీంతో ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

6. క్యారెట్‌ను త‌ర‌చూ తింటున్నా ర‌క్తం వృద్ధి చెంది తద్వారా ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

7. ఎండు ద్రాక్ష‌ల్లో 30 శాతం ఐర‌న్ ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్ల సంఖ్య‌ను పెంచుతుంది.

8. ఆప్రికాట్ పండ్ల‌ను నిత్యం రెండు సార్లు తీసుకున్నా చాలు. ర‌క్తం వృద్ధి చెంది ప్లేట్‌లెట్లు పెరుగుతాయి.

9. ఎండు ఖ‌ర్జూరం, కివీ పండ్ల‌ను తింటున్నా ప్లేట్‌లెట్లను బాగా పెంచుకోవ‌చ్చు. దీంతో వ్యాధి త‌గ్గుముఖం కూడా ప‌డుతుంది.

10. నారింజ పండు ర‌సం తాగుతున్నా ప్లేట్లెట్లు పెరుగుతాయి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved