స్కూల్ లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులందరికీ ఉపయోగపడే విషయం.

ఇది డిల్లీ లోని ఒక స్కూల్ లో జరిగిన సంఘటన.

ఈ ఫోటోలో ఉన్న ఎనిమిది సంవత్సరాల ఈ అమ్మాయిని సాయంత్రం వేళ స్కూల్ వదిలిపెట్టగానే, ప్రతిరోజూ ఆ అమ్మాయి తల్లి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళేది. కానీ ఒకరోజు ట్రాఫిక్ వల్ల ఆమె ఇంటి దగ్గర నుండి స్కూల్ వద్దకు రావడం ఆలస్యమైంది.

ఆ అమ్మాయి తన తల్లి కోసం స్కూల్ గేట్ బయట వేచి చూస్తూ ఉంది.దీనిని ఆసరాగా తీసుకొన్న ఒక వ్యక్తి , ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి “ మీ అమ్మకు వేరే అర్జంట్ వర్క్ ఉండటం వల్ల ఇప్పుడు స్కూల్ దగ్గరకు రాలేకపోయింది, అందుకే నిన్ను తీసుకురమ్మని నన్ను పంపించింది “ అని ఆ అమ్మాయితో చెప్పాడు.

వెంటనే ఆ అమ్మాయి , “ సరే మా అమ్మ నన్ను తీసుకురమ్మని , నిన్ను పంపించినట్లయితే మా అమ్మ నీకు చెప్పిన పాస్ వర్డ్ చెప్పు “ అని అడిగింది.వాడికేమీ అర్థం కాలేదు. అటూ ఇటూ చూసి తడబడ్డాడు.

ఆ అమ్మాయికి వాడి దుర్మార్గపు బుద్ధి అర్థమై , గట్టిగా అరిచేలోపుగా వాడు అక్కడి నుండి తప్పించుకున్నాడు.

ఈ మధ్యకాలంలో మాయమాటలు చెప్పి స్కూల్ పిల్లల కిడ్నాప్ లు ఎక్కువగా జరుగుతుండటంతో, ఆ అమ్మాయి తల్లి , తన కూతురికి ఒక పాస్ వర్డ్ ను చెప్పింది.

స్కూల్ వద్దకు తాను కాకుండా ఎవరైనా వచ్చి రమ్మని పిలిస్తే వాళ్ళను ఆ పాస్ వర్డ్ ను అడగమని చెప్పింది.

అప్పుడు ఆ పాస్ వర్డ్ వాళ్ళు చెప్పలేకపోతే కిడ్నాపర్ అని కనిపెట్టి గట్టిగా అరవమని చెప్పింది.తన తల్లి చెప్పిన ఈ ఉపాయం వల్ల ఆ అమ్మాయికిడ్నాపర్ ల బారి నుండి తప్పించుకోగలిగింది.

తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు ఈ పాస్ వర్డ్ విధానాన్ని పాటిస్తే చాలా వరకు కిడ్నాపర్ల బారి నుండి తమ పిల్లలను రక్షించుకోవచ్చు.

Kindly share it very useful message


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved