పెట్రోల్ బంకుల్లో 50, 100, 200, 300.. రూల రౌండ్ ఫిగర్ పెట్రోల్ పోయిస్తున్నారా..?

వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టేందుకు పెట్రోల్ బంక్ నిర్వాహకులు కనిపెట్టిన నయా మోసమిది. కల్తీలపై వినియోగదారుల ఫిర్యాదులు, రైడింగ్ లు, ఫెనాల్టీలు.. పెరిగిపోవడంతో వాహన వినియోగదారులను దోచుకునేందుకు రోజు రోజుకు కొత్త కొత్త పధకాలను అమలుచేసి మోసాలకు పాల్పడుతున్నారు. అదేమిటో తెలుసుకుని జాగ్రత్త వహించకుంటే పెట్రోల్, డీజిల్ కొనడానికి వెళ్లిన ప్రతిసారీ మోసపోవాల్సిందే..

నిర్వాహకులు అమలు చేస్తున్న పధకం:

సాధారణంగా 50, 100, 200, 300.. రూపాయల రౌండ్ ఫిగర్ పెట్రోల్ పోయిస్తుంటాం. ఈ క్రమంలో కనీసం 200 ml పెట్రోల్ ను నష్టపోయినట్టే. ఈ విషయాన్ని ప్రాక్టికల్ గా పట్టుకున్నారు. దీనిపై సోషల్ మీడియాలో ఓ మెస్సేజ్ కొద్ది రోజులుగా హల్ చల్ సైతం చేస్తోంది. బంక్ నిర్వాహకులు పెట్రోల్ పంప్ డిజిటల్ మీటర్ ప్రోగ్రామింగ్ లో ముందే ఓ 100-300 ml తక్కువగా వచ్చేలా ఫిక్స్ చేస్తున్నారు. అయితే మొత్తం పెట్రలో పంప్ సెట్టింగ్ మాత్రం సాధారణంగానే ఉంటుంది. కాని ఎక్కువమంది వినియోగదారులు పెట్రోల్ కొట్టించే ఫిగర్లయిన పైన చెప్పిన నాలుగు రకాల వారికి మాత్రం తక్కువ వచ్చేలా సెట్ చేస్తున్నారు. దీంతో రోజూ పెట్రోల్/డీజిల్ కొట్టించే వారిలో అత్యధికమంది మోసపోయిన జాబితాలో చేరుతున్నారు.

ఈ మోసాన్ని అరికట్టడానికి మనం ఏం చెయ్యాలి:

పెట్రోల్ పంప్ నిర్వాహకుల ఈ దందాకు చెక్ పడాలంటే మీరు ఓ పని చేయాలి. అదేంటంటే 60, 110, 120, 210, 220, 310, 320…. ఇలా ప్రోగ్రామింగ్ లో లేని ఫిగర్ లలో పెట్రోల్/ డీజిల్ పోయించుకోవాలి. దీంతో

ఎక్కువ మంది పెట్రోల్ పోయించే ఫిగర్లకే దందాను అప్లయ్ చేసిన యజమానులు ఇక మిమ్మల్ని మోసం చేయలేరు. రౌండ్ ఫిగర్ లో పెట్రోల్ పోయించొద్దంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచార ఉద్యమం నడుస్తోంది. అందరూ ఇలా చేయకపోయినా… అక్రమ సంపాదనకు కక్కుర్తిపడిన బంకు యజమానులు చాలా మంది ఇలా చేస్తున్నారు.

మోసపోకుండా మరిన్ని జాగ్రత్తలు:

సాధ్యమైన మేర రాత్రివేళనే కొట్టించాలి. ఎందుకంటే ఆవిరయ్యే ప్రమాదం తప్పతుందిbr> పెట్రోల్ మీటర్ జంప్ చేస్తుంటారు. అందుకే బంక్ లో బాయ్ లతో మాట్లాడడం వంటివి చేయకుండా మీటర్ ని తదేకంగా గమనించాలి.

పెట్రోల్ కొట్టిస్తున్న సమయంలో మీ దృష్టి మరల్చేలా బాయ్ డబ్బులు అడిగినా, ఎయిర్ చెక్ చేయాలాని అడిగినా మీ దృష్టిని మాత్రం మీటర్ రీడింగ్ పై నుంచి మరల్చకండి.

రౌండ్ ఫిగర్ కంటే చిల్లర మీ వద్ద ఉంటే దానికి తగ్గట్లు పెట్రోల్ పోయించండి. మీకు ఏ బంకులోనైనా పంప్ మీటర్ అసాధారణంగా తిరుగుతోందని అనిపిస్తే అక్కడ పెట్రోల్ కొట్టించకపోవడమే మంచిది.

ఫోర్ వీలర్స్ లో జర్నీ చేసేవారు లోపలే ఉండి కొట్టిస్తే మోసపోయే ఛాన్సెస్ ఎక్కువ. అందుకే కిందకి దిగి గమనించి కొట్టించాలి.

మరీ ముఖ్యంగా మీటర్ రీడింగ్ ‘0’ నుంచే కొడుతున్నారా? అనే విషయాన్ని నిశితంగా గమనించాలి.

మీరు చెప్పిన మొత్తం పెట్రోల్ కొట్టకుండా సరిగా వినపడలేదు.. సార్.. అంటూ మళ్లీ కొడుతుంటారు. అలాంటప్పుడు తిరిగి ‘0’ చేశారా లేదా అక్కడి నుంచే ప్రారంభించారా అన్నది తప్పనిసరిగా గమనించాలి.


Share on

© Copyrights telugu-news.in 2016. All rights reserved